Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 24 , 2026 | 06:36 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 24, 2026 21:50 IST

    ఏపీలో అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది: మంత్రి పార్థసారథి

    • గంజాయి బ్యాచ్‌లను గొడ్డలి పార్టీ పెంచి పోషిస్తోంది: మంత్రి పార్థసారథి

    • విమర్శించడానికి ఏమీ లేకే వైసీపీ కుల రాజకీయాలు: పార్థసారథి

    • పవన్‌కల్యాణ్‌పై అవాకులు, చవాకులు పేలుతున్నారు: పార్థసారథి

    • వైసీపీ పాలనలోనే మహిళలపై అరాచకాలు: మంత్రి పార్థసారథి

    • అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ నీచ రాజకీయాలు: పార్థసారథి

  • Jun 24, 2026 20:59 IST

    హైదరాబాద్‌: పారదర్శకంగా మత్స్య విక్రయాలకు బుకింగ్‌ వ్యవస్థ

    • పూర్తి డిజిటలైజ్‌ విధానంలో ఫిషరీస్‌ ఫెడరేషన్‌ బుకింగ్‌ సేవలు

    • స్పాట్ ట్రేడర్స్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కార్‌ కొత్త విధానం

  • Jun 24, 2026 20:34 IST

    అమరావతి అభివృద్ధి పనులు పరిశీలించిన ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు

    • CRDA ఆఫీస్‌ను సందర్శించిన ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు

    • అమరావతి పనుల పురోగతి, మౌలిక వసతుల పరిశీలన

  • Jun 24, 2026 20:26 IST

    చాతుర్మాస దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

    • మంగళగిరి పానకాల స్వామికి పూజలు చేసి దీక్ష ప్రారంభం

    • ఏటా చాతుర్మాస దీక్ష ఆచరిస్తున్న పవన్‌కల్యాణ్‌

  • Jun 24, 2026 20:12 IST

    సంగారెడ్డి: ప్రధాని మోదీ చెప్పిందే EC చేస్తోంది: జగ్గారెడ్డి

    • రాహుల్‌ ప్రధాని అయితేనే EC నియంత్రణలో ఉంటుంది: జగ్గారెడ్డి

    • ప్రతిపక్షాల ఓట్ల తొలగింపుతోనే BJPకి అనుకూల ఫలితాలు: జగ్గారెడ్డి

    • రాహుల్‌తోనే దేశంలో సుపరిపాలన సాధ్యం: జగ్గారెడ్డి

  • Jun 24, 2026 19:47 IST

    మహబూబాబాద్: పట్టణంలోని సాలార్ తండా వద్ద డీసీఎం వ్యాన్ బోల్తా

    • క్యాబిన్‌లో ఇరుక్కుని లాలయ్య (35) అనే వ్యక్తి మృతి

    • అతివేగమే ప్రమాదానికి కారణంగా అనుమానం

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 24, 2026 19:33 IST

    రేపు కర్ణాటకలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • విజయనగర జిల్లా హోస్పేటకు సీఎం రేవంత్‌ రెడ్డి

    • తుంగభద్ర డ్యాం 33 కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం

    • మునిరాబాద్‌ ప్రజాసభలో పాల్గొననున్న సీఎం రేవంత్‌

  • Jun 24, 2026 19:10 IST

    గుంటూరు: మంగళగిరి స్టేడియంలో సినీ నటుడు రామ్ చరణ్ సందడి

    • ఏపీఎల్ ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించిన రామ్ చరణ్

    • కార్యక్రమంలో పాల్గొన్న ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్

    • అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్ మ్యాచ్ టాస్‌లో పాల్గొన్న రామ్ చరణ్

    • ఏపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్లందరికీ రామ్ చరణ్ అభినందనలు

    • స్టేడియం చుట్టూ తిరిగి అభిమానులకు అభివాదం చేసిన రామ్ చరణ్

  • Jun 24, 2026 19:06 IST

    హైదరాబాద్: కూకట్‌పల్లి PNR ఎంపైర్‌‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు...

    • వంటగదిలో ఎలుకలు, బొద్దింకలను గుర్తించిన అధికారులు

    • అపరిశుభ్రత వాతావరణo చూసి విస్తుపోయిన అధికారులు

    • ఫుడ్ లైసెన్స్ రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక

  • Jun 24, 2026 18:41 IST

    ఏలూరు: కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం

    • ఎంపీ పుట్టా మహేష్ అధ్యక్షతన అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష

    • జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై చర్చ

  • Jun 24, 2026 18:40 IST

    మార్కాపురం: కొమరోలులోని పోస్టాఫీస్‌ వీధిలో చోరీ

    • వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు

    • బీరువా పగలగొట్టి 10 తులాల బంగారం, 1.20 లక్షల నగదు అపహరణ

    • కేసు నమోదు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 24, 2026 18:04 IST

    ఏలూరు జిల్లా: ICDS కోడిగుడ్ల సరఫరాలో కాంట్రాక్టర్‌ అక్రమాలు

    • నూజివీడు మండలం తుక్కులూరులో మంత్రి పార్థసారథి తనిఖీలు

    • ICDS కోడిగుడ్ల అక్రమ రవాణాను గుర్తించిన మంత్రి పార్థసారథి

    • అక్రమ రవాణాపై చర్యలు తీసుకుని కాంట్రాక్టును రద్దు చేయాలని మంత్రి సూచన

  • Jun 24, 2026 18:01 IST

    తిరుపతి: పాకాల మండలం గాదంకి దగ్గర రోడ్డు ప్రమాదం

    • ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురి మృతి

    • ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • మృతులు తవణంపల్లికి చెందిన మాధవి, మేఘన, రాజశేఖర్‌గా గుర్తింపు

  • Jun 24, 2026 18:00 IST

    తిరుపతి క్రైమ్‌ అదనపు ఎస్పీ బాలచంద్రారెడ్డి బదిలీ

    • బాలచంద్రారెడ్డి పోస్టింగ్‌పై టీడీపీ నేతల విమర్శలు

    • వైసీపీ సానుభూతిపరుడిగా బాలచంద్రారెడ్డిపై ముద్ర

    • మంగళగిరి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు ASP బాలచంద్రారెడ్డిని రిపోర్టు చేయాలని ఉత్తర్వులు

  • Jun 24, 2026 17:30 IST

    హోర్ముజ్‌లో ఎలాంటి టోల్‌ ఛార్జీలూ లేవు: డొనాల్డ్‌ ట్రంప్‌

    • ఛార్జీలు లేకుండా నౌకల రాకపోకలకు ఇరాన్‌ అంగీకరించింది: డొనాల్డ్‌ ట్రంప్‌

    • ఇరాన్‌కు మేము ఎలాంటి నగదూ ఇవ్వట్లేదు: డొనాల్డ్‌ ట్రంప్‌

    • ఇరాన్‌ ఆస్తులను కూడా విడుదల చేయం: డొనాల్డ్‌ ట్రంప్‌

    • అవసరమైతే ఆహారం కొనుగోలు చేసి ఇరాన్‌కు ఇస్తాం: ట్రంప్‌

  • Jun 24, 2026 17:25 IST

    విజయవాడ: మా పోరాటం ఫలించింది: ABNతో సాయికృష్ణ కుటుంబసభ్యులు

    • సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు: సాయికృష్ణ కుటుంబసభ్యులు

    • మా ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంది: సాయికృష్ణ కుటుంబసభ్యులు

    • కేసులో మిగతావారినీ అరెస్ట్ చేయాలి: సాయికృష్ణ కుటుంబసభ్యులు

  • Jun 24, 2026 17:25 IST

    జమ్మూకశ్మీర్‌ కథువాలో రోడ్డు ప్రమాదం

    • లోయలో పడ్డ మినీ బస్సు.. 23 మందికి గాయాలు

    • కథువా జిల్లాలోని సుక్రాలా మాత ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘటన

  • Jun 24, 2026 17:24 IST

    ఈనెల 30న సీఎం రేవంత్‌ రైతు ఆశీర్వాద సభ: భట్టి విక్రమార్క

    • చింతకాని మండలం జగన్నాధపురంలో సభ: భట్టి విక్రమార్క

    • మాది పేదల సంక్షేమ ప్రభుత్వం: భట్టి విక్రమార్క

    • ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: భట్టి విక్రమార్క

  • Jun 24, 2026 16:23 IST

    జనగామ అంబేద్కర్‌ నగర్‌లో విషాదం

    • ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

    • చిన్నారి మృతితో కుప్పకూలి నాయనమ్మ నాగమ్మ(65) మృతి

  • Jun 24, 2026 16:23 IST

    కామారెడ్డి గొడవపై కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ స్పందన

    • కామారెడ్డిలో నేతల మధ్య సమన్వయం కుదిరింది: కమిటీ

    • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా షబ్బీర్‌ అలీ, చంద్రశేఖర్‌రెడ్డి కలిసి పనిచేస్తారు: కమిటీ

  • Jun 24, 2026 16:22 IST

    ప్రధాని మోదీకి ఇరాన్ నుంచి ఆహ్వానం

    • మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ఆహ్వానం

    • ఈ అహ్వానంపై అధికారికంగా స్పందించని కేంద్ర ప్రభుత్వం

  • Jun 24, 2026 16:05 IST

    BRS మాజీ MLA బాల్క సుమన్‌కు బెయిల్‌

    • వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బెయిల్‌

    • రూ.25 వేల పూచీకత్తుతో హైకోర్టు బెయిల్‌

  • Jun 24, 2026 16:04 IST

    సీఎం కుర్చీలో కూర్చోవాలని కేటీఆర్‌ ఆశ: ప్రభుత్వ విప్‌ యెన్నం

    • చెల్లిని పంపినట్లే తండ్రినీ పంపించేయాలని చూస్తున్నారు: యెన్నం

    • భజన బృందంతో KTR.. సీఎం.. సీఎం అని అనిపించుకున్నారు

    • BRS హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ను ప్రజలు మరిచిపోలేదు: యెన్నం

    • BRS హయాంలో తెలంగాణ సర్వనాశనం: ప్రభుత్వ విప్‌ యెన్నం

  • Jun 24, 2026 16:00 IST

    మేయర్ కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన వ్యక్తి

    • మ్యాన్‌హోల్‌లో పడ్డ వ్యక్తిని బీఎంసీ పారిశుద్ధ్య కార్మికుడిగా గుర్తింపు

    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

    పూర్తి కథనం..

  • Jun 24, 2026 15:56 IST

    లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు..

    • 790 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

    • 197 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ

    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.66గా ఉంది

    పూర్తి కథనం..

  • Jun 24, 2026 15:45 IST

    హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

    • ఇంట్లో ఉన్న ఒంటరి ఉన్న దివ్యాంగురాలిపై అత్యాచారం

    • మహిళా మెడ, చేతులకు స్వల్ప గాయాలు

    • కేసు నమోదు, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఎల్బీ నగర్ పోలీసులు

  • Jun 24, 2026 15:43 IST

    ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల

    • టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి బిగ్ షాక్

    • మూడో స్థానానికి పడిపోయిన కోహ్లీ

    • నాల్గో స్థానంలోనే కొనసాగుతున్న రోహిత్

    • రెండో స్థానంలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్

  • Jun 24, 2026 15:32 IST

    వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ కీలక కామెంట్స్

    • 20 ఏళ్లు వచ్చిన తర్వాతే వైభవ్‌ను జడ్జ్ చేద్దాం: కపిల్ దేవ్

    • వైభవ్ మరీ చిన్న కుర్రాడే: కపిల్ దేవ్

    • అప్పుడే అతడిపై ఒత్తిడి పెట్టడం సరికాదు: కపిల్ దేవ్

  • Jun 24, 2026 14:46 IST

    నెల్లూరు: దుత్తలూరు మండలం బండకింద పల్లి అటవీ ప్రాంతంలో మృతదేహం కలకలం

    • ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న పోలీసులు

  • Jun 24, 2026 14:39 IST

    కోల్‌కతాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోదాం పైకప్పు

    • శిథిలాల్లో చిక్కుకున్న పలువురు కార్మికులు

    • కొనసాగుతున్న సహాయక చర్యలు

    • ప్రమాద సమయంలో విధుల్లో సుమారు 60 మంది కార్మికులు

    • పశ్చిమ బెంగాల్‌లోని తారతలా ప్రాంతంలో ఘటన

    పూర్తి కథనం..

  • Jun 24, 2026 14:29 IST

    ఏపీలో సువర్ణ అధ్యాయం మొదలైంది: సీఎం చంద్రబాబు

    • రాయలసీమ రతనాల సీమగా మారబోతోంది: సీఎం చంద్రబాబు

    • జొన్నగిరి గోల్డ్‌ మైన్‌తో ఇక్కడి ప్రజల జీవితాలు మారుతాయి: చంద్రబాబు

    • గతంలో జొన్నగిరిని స్వర్ణగిరిగా పిలిచేవారు: చంద్రబాబు

    • మన దగ్గర కూడా బంగారం ఉత్పత్తి కాబోతోంది: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం..

  • Jun 24, 2026 13:32 IST

    కృష్ణా జిల్లా: కొక్కిలిగడ్డలో కొనసాగుతున్న మంత్రి లోకేశ్ పర్యటన

    • శ్రీమల్లేశ్వరస్వామి, అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి లోకేశ్

    • స్వామి వారికి నారా లోకేశ్ ప్రత్యేక పూజలు

    • మంత్రి లోకేశ్‌ను సత్కరించిన దేవాదాయ శాఖ అధికారులు

    • కాసేపట్లో మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి మంత్రి లోకేశ్

  • Jun 24, 2026 13:09 IST

    కర్నూలు: జొన్నగిరికి సీఎం చంద్రబాబు

    • గోల్డ్‌ మైన్స్‌ ప్లాంట్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • Jun 24, 2026 13:07 IST

    సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

    • సాయికృష్ణది కస్టోడియల్ డెత్: రిమాండ్ రిపోర్ట్

    • సాయికృష్ణ డెడ్‌బాడీని మాయం చేశారు: రిమాండ్ రిపోర్ట్

    • సాయికృష్ణ మృతదేహాన్ని పీఎస్‌లోనే చూసినట్టు ఎస్ఐ స్టేట్‌మెంట్ ఇచ్చారు: రిమాండ్ రిపోర్టు

    • నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపర్చలేదు: రిమాండ్ రిపోర్ట్

    • జూన్ 6 నుంచి 19వ తేదీ మధ్య కృష్ణలంక పీఎస్ పరిధిలో ఘటన

  • Jun 24, 2026 13:02 IST

    విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసు

    • సీఐ నాగరాజును 2వ AJM కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

    • కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన సిట్

    • సాయికృష్ణ డెడ్‌బాడీని మాయం చేసినట్టు ఏ ఆధారాలున్నాయని కోర్టు ప్రశ్న

    • ఉద్దేశపూర్వకంగానే సీసీటీవీ ఫుటేజీ మాయం చేశారని తెలిపిన న్యాయవాది

  • Jun 24, 2026 12:55 IST

    కర్నూలు: జొన్నగిరి చేరుకున్న సీఎం చంద్రబాబు

    • మైనింగ్‌ ఏరియాను వీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

    • గోల్డ్‌ మైన్స్‌ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • Jun 24, 2026 12:53 IST

    ఢిల్లీ: ముగిసిన కేంద్ర కేబినెట్‌ భేటీ

  • Jun 24, 2026 12:47 IST

    రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన

    • ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు పునఃప్రారంభించడానికి సిద్ధమని వెల్లడి

  • Jun 24, 2026 12:21 IST

    విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసు

    • ప్రభుత్వాస్పత్రిలో సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు పూర్తి

    • కాసేపట్లో 2వ AJS కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

    • కోర్టుకు సమర్పించే రిమాండ్ రిపోర్టుపై ఉత్కంఠ

  • Jun 24, 2026 11:59 IST

    హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్ రావు లేఖ

    • తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ

    • RDS, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి

  • Jun 24, 2026 11:54 IST

    నాగపూర్ ఎయిర్‌పోర్టులో అనుకూలించని వాతావరణం

    • బెంగళూరు-నాగ్‌పూర్ విమానం శంషాబాద్‌కు తరలింపు

  • Jun 24, 2026 11:43 IST

    మహారాష్ట్ర సీఎంకు ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ

    • దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై FIR నమోదు చేయాలని డిమాండ్

    • 'లవ్ అండ్ వార్' సినిమా సెట్‌లో కార్మికుడి మృతిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరిన AICWA

  • Jun 24, 2026 11:40 IST

    కామారెడ్డి: నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డిలో రైతుల ఆందోళన

    • యూరియా యాప్‌ను రద్దు చేయాలని రైతుల డిమాండ్

  • Jun 24, 2026 11:32 IST

    హైదరాబాద్: గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం

    • ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం

  • Jun 24, 2026 11:23 IST

    సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ

    • కేసును CBIకి అప్పగించాలని హైకోర్టులో పిల్

    • కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశామన్న ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్

    • ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును అరెస్ట్ చేశాం: ఏజీ శ్రీనివాస్

    • ఇవాళ కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపిన ఏజీ

    • తదుపరి విచారణ జులై 6కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

  • Jun 24, 2026 11:06 IST

    ఓటు హక్కు రాజకీయాల కోసం మాత్రమే కాదు: మీనాక్షి నటరాజన్

    • ఓటు అనేది ప్రతి మనిషికి సోషల్ స్టేటస్: మీనాక్షి నటరాజన్

    • ఎంతో కష్టపడితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓటు హక్కు వచ్చింది: మీనాక్షి నటరాజన్

    • ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత మన అందరిది: మీనాక్షి నటరాజన్

  • Jun 24, 2026 10:58 IST

    హైదరాబాద్: SIRపై జూమ్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

    • పలువురు MLAలు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు: సీఎం రేవంత్

    • SIRతో బీజేపీ కుట్ర చేస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి

    • అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవు: రేవంత్‌రెడ్డి

    • MLAలు నియోజకవర్గంలోనే ఉంటూ మానిటరింగ్ చేయాలి: సీఎం రేవంత్

  • Jun 24, 2026 10:43 IST

    కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ

    • పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

  • Jun 24, 2026 10:39 IST

    హైదరాబాద్: ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆగ్రహం

    • SIR ప్రక్రియలో నిర్లక్ష్యంపై మండిపడిన మహేశ్ గౌడ్

    • చాలా మంది ఎమ్మెల్యేలు ఉదాసీనంగా ఉన్నారు: మహేశ్ గౌడ్

    • SIRపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

  • Jun 24, 2026 10:37 IST

    విజయవాడ: ముగిసిన సీఐ నాగరాజు సిట్‌ విచారణ

    • ప్రభుత్వాస్పత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు

    • ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు

    • కాసేపట్లో 2వ AJS కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

  • Jun 24, 2026 10:29 IST

    ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో 'ప్రజాదర్బార్'

    • ప్రజల నుంచి వినతులు స్వీకరించిన MLA వసంత కృష్ణప్రసాద్

    • ప్రజాహితమే ప్రభుత్వ అభిమతం: MLA వసంత కృష్ణప్రసాద్

    • ప్రజాదర్బార్ ద్వారా ప్రజల వద్దకే పాలన: వసంత కృష్ణప్రసాద్

  • Jun 24, 2026 10:24 IST

    కృష్ణా జిల్లా: మోపిదేవి మండలంలో మంత్రి లోకేశ్ పర్యటన

    • లోకేశ్‌తోపాటు మంత్రి సుభాశ్, ఎంపీ బాలశౌరి, పలువురు ఎమ్మెల్యేలు

    • కొక్కిలిగడ్డలో జడ్పీ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన లోకేశ్

    • పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి లోకేశ్

  • Jun 24, 2026 10:11 IST

    నటుడు ప్రకాశ్రాజ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    • నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసిన బెంగళూరు కోర్టు

    • ప్రకాశ్‌రాజ్ 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారనే అంశంపై ఫిర్యాదు

    • పలుమార్లు సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజరుకాని ప్రకాశ్‌రాజ్

    • కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీలో ఓటు కలిగి ఉన్నారని 2019లో ప్రకాశ్‌రాజ్‌పై ఫిర్యాదు నమోదు

  • Jun 24, 2026 09:54 IST

    ఫిఫా ప్రపంచ కప్: నాకౌట్‌కు కొలంబియా

    • డీఆర్ కాంగోపై 0-1 తేడాతో విజయం సాధించిన కొలంబియా

  • Jun 24, 2026 09:48 IST

    బాపట్ల: కారంచేడు సమీపంలో ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు

    • ఇద్దరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Jun 24, 2026 09:33 IST

    లాభాల్లో దేశీయ సూచీలు

    • 251 పాయింట్ల లాభంలో సెన్సెక్స్

    • 55 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ

    • డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.86

  • Jun 24, 2026 09:05 IST

    జనగామ: చీటకోడూర్ రిజర్వాయర్ వద్ద విద్యుత్ షాక్‌కు గురై లైన్‌మన్ మృతి

    • ట్రాన్స్‌ఫార్మర్ తనిఖీ చేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో మృతిచెందిన లైన్‌మన్ కరుణాకర్‌రెడ్డి

    • ప్రమాదానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు

  • Jun 24, 2026 08:53 IST

    విజయవాడ: పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సిట్ బృందం

    • సీఐ నాగరాజును మరోసారి ప్రశ్నిస్తున్న సిట్ చీఫ్‌ రవిప్రకాశ్

    • కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించనున్న సిట్

    • మధ్యాహ్నంలోపు నాగరాజును కోర్టులో హాజరుపర్చనున్న సిట్

    • సిట్ అధికారుల ప్రశ్నలకు నోరు మెదపని సీఐ నాగరాజు

  • Jun 24, 2026 08:29 IST

    నెల్లూరు: డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలపై స్పందించిన వక్ఫ్ బోర్డు

    • పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి AS పేట దర్గాలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ ఫిర్యాదులపై వ్యాఖ్యానించిన పవన్

  • Jun 24, 2026 08:22 IST

    నేడు తుంగభద్ర, RDS అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష

    • కృష్ణా, బీమా నదుల ప్రాజెక్ట్ ప్రతిపాదనలపై సమావేశం

    • రేపటి 3 రాష్ట్రాల సీఎంల భేటీలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ

    • పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్న మంత్రి ఉత్తమ్

  • Jun 24, 2026 08:06 IST

    తిరుమల: నేడు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ నెల టికెట్ల విడుదల

    • ఉ.10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల

    • మ.3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటా విడుదల

  • Jun 24, 2026 07:47 IST

    నిర్మల్‌ జిల్లా: బాసర మహంకాళి ఆలయంలో చోరీ కేసు

    • నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు

    • ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు హోంగార్డులను సరెండర్‌ చేసిన ఈవో ఆంజనీదేవి

    • అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన హోంగార్డ్‌లపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి లేఖ

  • Jun 24, 2026 07:28 IST

    అమెరికా సెనేట్ సంచలన నిర్ణయం

    • ఇరాన్‌తో యుద్ధాన్ని నిరోధిస్తూ తీర్మానం

    • కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా యుద్ధానికి వెళ్లకుండా ట్రంప్ అధికారాలను కట్టడి చేస్తూ తీర్మానం

    • US బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సెనేట్ ఉమ్మడి తీర్మానానికి ఆమోదం

    పూర్తి కథనం

  • Jun 24, 2026 07:14 IST

    ఢిల్లీ: ఉద్యోగ్ భవన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

    • స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

    • ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో మంటలు చెలరేగి తాత్కాలిక నిర్మాణాలకు వ్యాపించిన మంటలు

    • 20 ఫైరింజన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

  • Jun 24, 2026 06:52 IST

    నేటి నుంచి ఈ నెల 30 వరకు మంగళగిరిలో APL సీజన్‌-5

    • నేడు మంగళగిరిలో మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్‌

    • ఫైనల్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేశ్

  • Jun 24, 2026 06:51 IST

    ఏపీలోని పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    • విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పోలవరం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వర్ష సూచన

    • కడప, నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం

  • Jun 24, 2026 06:51 IST

    ఈ నెల 28 వరకు తెలంగాణలో మోస్తరు వర్షాలు

    • నేడు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, మెదక్‌, కామారెడ్డికి వర్ష సూచన

    • రేపు ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు భారీ వర్ష సూచన

  • Jun 24, 2026 06:50 IST

    హైదరాబాద్‌: SIR ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ ఫోకస్‌

    • నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో సమావేశం

    • పాల్గొననున్న సీఎం రేవంత్‌, మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్‌

  • Jun 24, 2026 06:49 IST

    అమరావతి: నేడు అవనిగడ్డ నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ పర్యటన

    • ఉదయం మోపిదేవి మం. కొక్కిలిగడ్డలో జడ్పీ పాఠశాల భవనం ప్రారంభం

    • మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శన

    • మధ్యాహ్నం అవనిగడ్డ నియోజకవర్గ కార్యకర్తలతో లోకేశ్ సమావేశం

    • సాయంత్రం పులిగడ్డ గురుకుల పాఠశాల వద్ద మత్స్యకారులతో లోకేశ్ సమావేశం

  • Jun 24, 2026 06:47 IST

    సాయికృష్ణ తల్లి ఫిర్యాదు కాపీలో కీలక విషయాలు

    • ఈ నెల 19న ఫిర్యాదు చేసిన విజయలక్ష్మి

    • సాయికృష్ణను సీఐ నాగరాజు కొట్టి చంపారని ఆరోపణ

    • తన ఎదుటే సాయికృష్ణను తీవ్రంగా కొట్టారని ఫిర్యాదు

  • Jun 24, 2026 06:45 IST

    అమరావతి: స్థానిక కేడర్లలో ఉద్యోగుల కేటాయింపుపై నేడు కీలక భేటీ

    • అధ్యక్ష ఉత్తర్వులు-2025 అమలుపై ఉద్యోగ సంఘాలతో చర్చలు

    • సర్వీసెస్ విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సా. 4:00 గంటలకు ఏపీ సచివాలయంలో సమావేశం

    • స్థానిక కేడర్లలో ఉద్యోగుల కేటాయింపుపై అభిప్రాయాల సేకరణ

  • Jun 24, 2026 06:42 IST

    ఏపీలో తొలి ప్రైవేట్‌ గోల్డ్‌ మైన్‌కు నేడు భూమిపూజ

    • కర్నూలు జొన్నగిరిలో గోల్డ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌

    • రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

    • రూ.405 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు అభివృద్ధి

    • తొలి ఏడాది 400 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యం

  • Jun 24, 2026 06:41 IST

    నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భట్టి పర్యటన

    • పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలకు హాజరుకానున్న భట్టి విక్రమార్క

  • Jun 24, 2026 06:41 IST

    ఖమ్మం: నేడు సత్తుపల్లిలో కేటీఆర్‌ పర్యటన

    • BRS జనరల్‌ బాడీ సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్‌

  • Jun 24, 2026 06:40 IST

    అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందంతో హోర్ముజ్‌ నుంచి నౌకల రవాణా

    • ఈ నెల 18న ఒప్పందం కుదిరినప్పటి నుంచి హోర్ముజ్‌ దాటిన 172 నౌకలు

    • హోర్ముజ్ జలసంధి దాటిన 11 భారతీయ నౌకలు