తగ్గిన చమురు ధరలు.. సూచీలకు భారీ లాభాలు..
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:58 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కిందకు దిగి వస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గి 76.29 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కిందకు దిగి వస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గి 76.29 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు విదేశీ మదుపర్లు వరుసగా కొనుగోళ్లు సాగిస్తుండడం, మంగళవారం భారీగా నష్టపోయిన ఐటీ సెక్టార్ బుధవారం తిరిగి పుంజుకోవడం సానుకూలంగా మారింది. హెవీ వెయిట్ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కూడా సెన్సెక్స్, నిఫ్టీని లాభాల బాట పట్టించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,200)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు కొనసాగించింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 790 పాయింట్ల లాభంతో 76,991 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 197 పాయింట్ల లాభంతో 24,021 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీ సిమెంట్స్, హిందుస్థాన్ పెట్రో మొదలైన షేర్లు లాభాలను ఆర్జించాయి (share market news). వెర్నోవా టీడీ, ఐఆర్‌ఎఫ్‌సీ, హిటాచీ ఎనర్జీ, సీమన్స్, సీజీ పవర్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 966 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 64 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.66గా ఉంది.
ఇవి కూడా చదవండి..
నేరారోపణలు ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రవేశం నిరాకరణ: సుప్రీంకోర్టు కీలక తీర్పు
భారీ నష్టాల నుంచి కోలుకున్నాయ్.. లాభాల్లో దేశీయ సూచీలు..