🔴AP Assembly Session LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ABN, Publish Date - Sep 18 , 2025 | 09:30 AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా.. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు ఉదయం 8 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సమావేశాలకు కూటమిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ రోజు ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి.
Updated at - Sep 18 , 2025 | 09:36 AM