Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 10 , 2026 | 06:26 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Apr 10, 2026 09:06 IST

    నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నేడు మంత్రి జూపల్లి పర్యటన

    • పెద్దకొత్తపల్లి మండలం కాల్వకోల్‌‌లో పర్యటించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

    • ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

    • బాధితులకు సీఎంఆర్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

  • Apr 10, 2026 08:42 IST

    నేడు మ. 2:00 గంటలకు కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి భేటీ

    • త్వరలో BRSలో చేరనున్న జీవన్‌రెడ్డి

  • Apr 10, 2026 08:23 IST

    నేడు ఉత్తరాంధ్రకు వడగాలుల హెచ్చరిక

    • రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

    • విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య,..

    • చిత్తూరు జిల్లాలో అకాల వర్షాలు

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

  • Apr 10, 2026 07:30 IST

    నేడు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన

    • ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్

  • Apr 10, 2026 07:20 IST

    హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సుప్రీం లీడర్ కీలక ప్రకటన

    • హోర్ముజ్ జలసంధి నిర్వహణలో కొత్త దశకు చేరుకున్నాం: మొజ్తాబా

    • మా దేశంపై దాడి చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టం: మొజ్తాబా

    • పరిహారం కోసం కచ్చితంగా డిమాండ్ చేస్తాం: మొజ్తాబా

    పూర్తి కథనం

  • Apr 10, 2026 06:58 IST

    నేటి మార్కెట్లో దాదాపు స్థిరంగా బంగారం, వెండి ధరలు

    • రూ.1 మేర తగ్గి రూ.1,51,470కి చేరిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం

    • అంతేస్థాయిలో పతనమై రూ.1,38,840 వద్ద ట్రేడ్ అవుతోన్న 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి

    • రూ.100 మేర తగ్గి రూ.2,54,900కి చేరిన కిలో వెండి

    పూర్తి కథనం

  • Apr 10, 2026 06:47 IST

    హోర్ముజ్‌ జలసంధిలో టోల్‌ట్యాక్స్‌ను తప్పుపట్టిన ట్రంప్‌

    • పన్ను వసూలు తక్షణం నిలిపివేయాలని ఇరాన్‌కు ట్రంప్‌ సూచన

    • హోర్ముజ్‌ మీదుగా వెళ్లే ట్యాంకర్ల నుంచి ఇరాన్‌ రుసము వసూలు చేస్తున్నట్లు వార్తలు

    • నౌకల నుంచి టెహ్రాన్‌ పన్నులు వసూలు చేయకపోవడమే మంచిదన్న ట్రంప్‌

  • Apr 10, 2026 06:45 IST

    లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలకు ఇజ్రాయెల్‌ అంగీకారం

    • వీలైనంత త్వరగా చర్చలు జరపాలని అధికారులకు నెతన్యాహు సూచన

    • లెబనాన్‌ విజ్ఞప్తుల దృష్ట్యా చర్చలకు అంగీకరించినట్లు తెలిపిన నెతన్యాహు

  • Apr 10, 2026 06:38 IST

    కాల్పుల విరమణను శాశ్వత శాంతిగా మార్చేందుకు అమెరికా-ఇరాన్‌ చర్చలు

    • ఇప్పటికే ఇస్లామాబాద్‌ చేరుకున్న ఇరుదేశాల ప్రతినిధులు

    • తమ ప్రతినిధుల రాకను ధ్రువీకరించిన పాక్‌లోని ఇరాన్‌ రాయబారి

    • ఇరాన్‌ ప్రతిపాదించిన 10 పాయింట్ల ఆధారంగా ఇరుదేశాల ప్రతినిధుల చర్చలు

    • దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం ఓ విస్తృతమైన రోడ్‌మ్యాప్‌ దిశగా చర్చలు

  • Apr 10, 2026 06:36 IST

    నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం

    • ఉ.10:30కు సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్‌ భేటీ

    • కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో...

    • ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్న చంద్రబాబు

    • వైసీపీ అసత్య ప్రచారాలపై మంత్రులకు సూచనలు చేసే అవకాశం

    • త్వరలో కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తి కానుండడంతో...

    • ప్రజా ప్రతినిధులు అంతా జనంలోకి వెళ్లాలని సీఎం సూచించే అవకాశం

  • Apr 10, 2026 06:33 IST

    రాజ్యసభ సభ్యుడిగా నేడు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం

    • బిహార్‌లో త్వరలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

  • Apr 10, 2026 06:32 IST

    నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

    • CWC భేటీకి హాజరుకానున్న రేవంత్‌ రెడ్డి

  • Apr 10, 2026 06:31 IST

    హైదరాబాద్‌: ఏబీఎన్ ఆఫీస్‌పై దాడులకు దిగిన వైసీపీ నేతలపై కేసు నమోదు

    • ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దౌర్జన్యం, దాడులకు దిగిన..

    • 19 మంది YCP నాయకులపై BNS సెక్షన్ 351(2), రెడ్ విత్ 3(5) కింద..

    • ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

    పూర్తి కథనం

  • Apr 10, 2026 06:29 IST

    ఢిల్లీ: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

    • మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు సహా..

    • ప్రస్తుత రాజకీయ పరిణామాలపై CWC చర్చ