మిశ్రమంగా బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 06:32 AM
ఏప్రిల్ 10, 2026 నాటి బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గగా, బంగారం ధరలు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 10: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ ఒప్పందంపై ఉన్న అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు కొంతమేర బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అటు, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు నేరుగా పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇక, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వెండి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఏప్రిల్ 10, 2026 నాటి బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గగా, బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతోపాటు, దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయనే విషయానికొస్తే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం హైదరాబాద్ లో రూ. 1,51,470 ఉంది. నిన్నటితో పోలిస్తే (రూ. 1,51,480) రూ. 10 మేర తగ్గింది.
దేశంలోని ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ( 10 గ్రాములు) ఉన్నాయి:
హైదరాబాద్: రూ.1,51,470
విజయవాడ: రూ.1,51,480
విశాఖపట్నం: రూ.1,51,480
ముంబై: రూ.1,51,470
బెంగళూరు: రూ.1,51,470
ఢిల్లీ: రూ.1,51,620
చెన్నై: రూ.1,52,720
కేరళ: రూ. 1,51, 470
ఇక వెండి కిలో రూ. 2,59,900 గా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News