అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ABN , Publish Date - Apr 09 , 2026 | 05:40 PM
వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఖండించడానికి తాను మీడియా ముందుకు రాలేదన్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 09: వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఖండించడానికి తాను మీడియా ముందుకు రాలేదన్నారు. ఆయన వ్యాఖ్యలు అహంకార పూరితంగా ఉన్నాయని బొత్స అభివర్ణించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తనకు మధ్య ఎంతో అనుబంధం ఉందని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు.
గురువారం రాజధాని అమరావతిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుని బొత్స తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీపై గతంలో మీరు ఏమన్నారో మర్చిపోయారా? అంటూ కె. అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత.. తాను, తన భార్య పావురాల గుట్టకు వెళ్లామని పేర్కొన్నారు.
కావాలంటే రాజధాని అమరావతిపై మాట్లాడండి.. అంతేకానీ ఏమిటి ఈ మాటలు? అంటూ అచ్చెన్నాయుడిని బొత్స నిలదీశారు. చనిపోయిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడతారు? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలు కోసం ఇంత దిగజారుడా.. ఇదేమి రాజకీయం అంటూ సీఎం చంద్రబాబును బొత్స ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News