ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి.. 19 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
ABN , Publish Date - Apr 10 , 2026 | 07:06 AM
హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి 19 మంది కీలక వైసీపీ నేతలపై జూబ్లీహిల్స్ పరిధిలోని ఫిలిం నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 10: హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి కేసు నమోదైంది. 19 మంది వైసీపీ కీలక నేతలపై జూబ్లీహిల్స్ పరిధిలోని ఫిలిం నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిరసన పేరుతో ఈ నెల 7వ తేదీ(మంగళవారం) ఏబీఎన్ కార్యాలయం వద్దకు చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఉద్యోగులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
'మీ అంతు చూస్తాం, ఆఫీసును పగలగొడతాం, మేము తలుచుకుంటే ఒక్కరు కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్లలేరు' అంటూ వైసీపీ నేతలు బెదిరించిన నేపథ్యంలో కేసు నమోదైంది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై, ఇంకా సంస్థ ఉద్యోగులపై అత్యంత వికృతంగా, అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులు గుర్తించారు. ఈ నిరసన కారణంగా అపోలో ఆసుపత్రి సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనివల్ల అత్యవసర చికిత్స కోసం వెళ్తున్న సుమారు మూడు అంబులెన్సులు నిలిచిపోయి రోగులు ఇబ్బంది పడ్డారు.
కేసు నమోదైన 19 మంది వైసీపీ ప్రముఖ నేతల్లో మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇంకా ఆ పార్టీ కీలక నేతలు ఉన్నారు. వీరిపై భారత న్యాయ సంహిత (BNS) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో..
1. అంబటి రాంబాబు
2. జోగి రమేష్,
3. కాకాని గోవర్ధన్ రెడ్డి
4. మార్గాని భరత్
5. నాగార్జున
6. ఆదిమూలపు సురేష్
7. విశ్వరూప్
8. శంకర్ నారాయణ
9. అప్పి రెడ్డి
10. రమేష్ యాదవ్
11. గురుమూర్తి
12. రామసుబ్బారెడ్డి
13. కల్పలతారెడ్డి
14. కంభంపాటి రావు బాబు
15. చంద్రశేఖర్
16. లక్ష్మీ పార్వతి
17. శ్రీకాంత్ రెడ్డి
18. కారుమూరి వెంకట్ రెడ్డి
19. ఇశ్రాయేలు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News