-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 4th August 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 04 , 2026 | 07:28 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Aug 04, 2026 21:36 IST
ప్రముఖ నటుడు ప్రదీప్‌సింగ్ రావత్ కన్నుమూత
ముంబై నివాసంలో గుండెపోటుతో ప్రదీప్‌సింగ్ మృతి
సై, ఛత్రపతి, గజిని సహా పలు తెలుగు సినిమాల్లో నటించిన ప్రదీప్‌సింగ్ రావత్
-
Aug 04, 2026 21:22 IST
అమరావతి: ఆక్వా, పొగాకు, ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
నాన్ ఆక్వా జోన్‌కు రాయితీ విద్యుత్: సీఎం చంద్రబాబు
ఈనెల నుంచే రూ.1.50కే యూనిట్ విద్యుత్: సీఎం చంద్రబాబు
ఆఫ్ స్టైల్ పొగాకుపై కిలోకు రూ.10 మద్దతు: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో సంక్షోభ నివారణకు ఈనెల 7 నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు: సీఎం చంద్రబాబు
-
Aug 04, 2026 21:11 IST
హైదరాబాద్: ఎంపీ అర్వింద్.. తానే మేధావి అనుకుంటున్నారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సీఎం రేవంత్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మోదీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించాలని చాలామంది అడుగుతున్నారు: ఆది శ్రీనివాస్
ప్రధాని మోదీ ఏం చదువుకున్నారు?: ఆది శ్రీనివాస్
మోదీ తన డిగ్రీ సర్టిఫికెట్ ఎందుకు చూపించట్లేదు?: ఆది శ్రీనివాస్
సీఎం రేవంత్‌పై పిచ్చికూతలు కూస్తే మర్యాద దక్కదు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-
Aug 04, 2026 20:25 IST
తమిళనాడు: ఉదయనిధి స్టాలిన్ విడుదల
ఉదయనిధి స్టాలిన్‌ను గంటన్నరపాటు ప్రశ్నించిన పోలీసులు
విచారణ తర్వాత స్టేషన్ బెయిల్‌పై ఉదయనిధి స్టాలిన్ విడుదల
సీఎం విజయ్, నటి త్రిషపై వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఉదయనిధి
-
Aug 04, 2026 19:29 IST
ఢిల్లీ: అమర రాజా గ్రూప్ రాజన్న ఫౌండేషన్‌కు జాతీయ అవార్డు
గ్రామీణాభివృద్ధి విభాగంలో రాజన్న ఫౌండేషన్‌కు జాతీయ అవార్డు
CSR టైమ్స్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన వేడుకల్లో అవార్డు ప్రదానం
-
Aug 04, 2026 19:28 IST
కృష్ణా: పెనమలూరు వంతెన దగ్గర విషాదం
కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మృతదేహాన్ని తీసేందుకు కాలువలోకి దిగిన యువకుడు
నీటిలో నూకరాజు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు
-
Aug 04, 2026 18:35 IST
హైదరాబాద్: చందానగర్ అపార్ట్‌మెంట్‌లో విషాదం.. లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి
చందానగర్ అన్నపూర్ణ ఎనక్లేవ్‌లో ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెరుచుకోవడంతో కిందపడిన మహిళ
ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్టు ధ్రువీకరించిన వైద్యులు
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న చందానగర్ పోలీసులు
-
Aug 04, 2026 18:33 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తు
A9 కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈనెల 18 వరకూ రిమాండ్
గుంటూరు జైలుకు కిరణ్‌కుమార్‌రెడ్డి తరలింపు
మద్యం ముడుపుల నగదును షెల్ కంపెనీల ద్వారా తరలించినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఆరోపణలు
2024 నుంచి విదేశాల్లో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి
-
Aug 04, 2026 18:09 IST
తమిళనాడు: కాసేపట్లో తంజావూర్ సౌత్ పీఎస్‌కు ఉదయనిధి స్టాలిన్
DMK, TVK ఘర్షణలతో పీఎస్ పరిసరాల్లో భారీ భద్రత
ఉదయనిధి స్టాలిన్‌ను ప్రశ్నిస్తున్న తిరుచ్చి ఐజీ
త్రిషపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌ను.. అరెస్టు చేయొద్దని ఇప్పటికే మద్రాస్ హైకోర్టు ఆదేశం
ఉదయనిధిని ప్రశ్నించి విడిచిపెడతామని కోర్టుకు తెలిపిన AG
-
Aug 04, 2026 18:08 IST
హైదరాబాద్: సినిమా టికెట్ రేట్ల పంచాయితీ
రేట్లు, పర్సంటేజ్ విధివిధానాలపై చాంబర్ చర్చ
9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
పాత కమిటీని రద్దు చేసిన ఫిల్మ్ చాంబర్
కొత్త కమిటీకి లైమ్ లిమిట్ పెట్టని ఫిల్మ్ చాంబర్
సమయం తీసుకుని సమస్య పరిష్కరించే యోచనలో కమిటీ
-
Aug 04, 2026 17:53 IST
E20 పెట్రోల్ పాలసీపై కేంద్రం స్పష్టత
ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం
20 శాతం E20 లక్ష్యాన్ని అమలుచేస్తున్నాం: కేంద్రం
ముడిచమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం విదేశీ మారకద్రవ్యం ఆదాయే E20 మిశ్రమం లక్ష్యం: కేంద్రం
-
Aug 04, 2026 17:36 IST
అమరావతి: DSC నిర్వహణపై YCP ఆరోపణలు అర్థరహితం: బీసీ జనార్దన్‌రెడ్డి
DSC అభ్యర్థుల పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలను హైకోర్టు భగ్నం చేసింది: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
16 వేల మంది టీచర్ల కష్టాన్ని అవమానించేలా వైసీపీ వ్యవహరిస్తోంది: బీసీ జనార్దన్‌రెడ్డి
నిరుద్యోగుల కోసం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం: బీసీ జనార్దన్‌రెడ్డి
DSC నిర్వహణపై YCP నేతలు చర్చకు రావాలి: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
-
Aug 04, 2026 17:21 IST
ఢిల్లి: గత BRS మాదిరిగానే కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
చట్ట ప్రకారం నడిచే అధికారులపై వేటు వేస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మెటాపై కేసు నమోదు చేసిన డీసీపీ ఆనంద్‌బాబుని తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది: కిషన్‌రెడ్డి
ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేయడం రాజ్యాంగపరమైన హక్కు: కిషన్ రెడ్డి
-
Aug 04, 2026 17:20 IST
చిత్తూరు: వీ.కోట మండలం రామాపురం వద్ద రోడ్డు ప్రమాదం
ఇద్దరు మహిళల మృతి.. మరో ముగ్గురు యువకులకు గాయాలు
మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు
మృతులు తిరుపతికి చెందిన గౌతమి, మానసగా గుర్తించిన పోలీసులు
బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్న కారు టైర్ పంచర్ కావడంతో ఘటన
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 04, 2026 16:54 IST
హైదరాబాద్: ఈగల్ ఫోర్స్, నార్కోటిక్ పోలీసుల ఆపరేషన్
ఆల్ఫ్రాజోలమ్ డ్రగ్ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు
ఆరుగురి అరెస్టు, 1.18 కిలోల ఆల్ఫ్రాజోలమ్ స్వాధీనం
-
Aug 04, 2026 16:53 IST
న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో నితీశ్ కుమార్ భేటీ
పార్లమెంట్ భవనంలోని ప్రధాని కార్యాలయంలో సమావేశం
బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానంలో ఓటమి తర్వాత తొలిసారి భేటీ
బిహార్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం
-
Aug 04, 2026 16:47 IST
తిరుమల: సెప్టెంబరు 15 నుంచి 23 వరకూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాల రద్దు
అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం సేవల రద్దు
ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవల రద్దు
వృద్ధులు, దివ్యాంగులు, పిల్లలు, ఎన్‌ఆర్‌ఐ దర్శనాల రద్దు
-
Aug 04, 2026 16:36 IST
మంచిర్యాల: ఇందన్‌పల్లి FRO లక్ష్మీనారాయణ సస్పెన్షన్
ఆదివాసీలపై దాడి చేసినట్లు FROపై ఆరోపణలు
దాడి చేసిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రెండు రోజులుగా MLA వెడ్మ బొజ్జు పోరాటం
-
Aug 04, 2026 16:29 IST
జనగామ: జనగామలో విషాద ఘటన
గిర్నిగడ్డలో ఇంట్లో ఉరివేసుకొని నర్సింగ్ విద్యార్థి మెండే పూజ ఆత్మహత్య
బీఎస్సీ ఎంఎల్టీ సెకండ్ ఇయర్ చదువుతున్న పూజ
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 04, 2026 16:28 IST
ఢిల్లి: సింగరేణికి 3 కోల్ బ్లాక్‌లు కేటాయించాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మణుగూరు PKOC బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
వేలంలో పాల్గొనేందుకు అనేకమంది ముందుకొచ్చారు కానీ.. సింగరేణి కష్టాలను దృష్టిలో ఉంచుకునే కేటాయింపు
నైనీ, తాడిచర్ల బ్లాక్-2, మణుగూరు PKOC బ్లాక్‌లను సింగరేణికి కేటాయింపు మంచి పరిణామం: కిషన్‌రెడ్డి
కొత్త బ్లాక్‌ల కేటాయింపుతో సింగరేణి కొత్త ఆశలు: కిషన్‌రెడ్డి
గతంలో కాంగ్రెస్, BRS సింగరేణిని దోచుకున్నాయి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
-
Aug 04, 2026 16:20 IST
భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి
30.40 అడుగుల వద్ద 4,52,017 క్యూసెక్కుల ప్రవాహం
-
Aug 04, 2026 16:19 IST
YCP హయాంలో విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం: మంత్రి గొట్టిపాటి
అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు వల్ల నష్టాలు జరిగాయి: మంత్రి గొట్టిపాటి రవికుమార్
కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాo: మంత్రి గొట్టిపాటి
గత ఏడాది కొంత మేర విద్యుత్ చార్జీలు తగ్గించాo: మంత్రి గొట్టిపాటి
రాష్ట్రవ్యాప్తంగా కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు కొనసాగుతోంది: మంత్రి గొట్టిపాటి రవికుమార్
-
Aug 04, 2026 16:18 IST
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెలాఖరుకు చార్జ్‌షీట్
600 మందికి పైగా స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సిట్ బృందం
కేసులో కీలకంగా మారనున్న సాక్షుల వాంగ్మూలాలు
ఈ నెల చివరిలోపు చార్జ్‌షీట్ వేయాలని సిట్ నిర్ణయం
ప్రభాకర్‌రావు భారత్‌కు రావడం ఆలస్యం కావడంతో విచారణ ఆలస్యం
ఈ కేసులో కీలక సాక్ష్యాలన్నీ ధ్వంసం చేసినట్లు సిట్ గుర్తింపు
-
Aug 04, 2026 16:16 IST
హైదరాబాద్: AICC నిబంధనల ప్రకారం నివేదిక ఇచ్చాను: జగ్గారెడ్డి
PCC ఆదేశాలతో అందరి అభిప్రాయాలు తీసుకున్నాం: జగ్గారెడ్డి
నివేదికపై పీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారు: జగ్గారెడ్డి
పార్టీలో విభేదాలు కామన్.. అన్నీ సర్దుకుంటాయి: జగ్గారెడ్డి
-
Aug 04, 2026 16:16 IST
రేపు విశాఖ, అమరావతిలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
రేపు ఉదయం ఆరిలోవలో పీవీ సింధు అకాడమీ పనులకు శంకుస్థాపన
మధ్యాహ్నం ఇసుకతోటలో IBM ఫ్యూచర్‌నౌ సెంటర్ ప్రారంభం
సాయంత్రం అమరావతిలో అమృత వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న మంత్రి లోకేశ్
-
Aug 04, 2026 16:13 IST
శ్రీకాకుళం: ముగిసిన మాజీ మంత్రి అప్పలరాజు విచారణ
4 గంటల పాటు సాగిన అప్పలరాజు విచారణ
విచారణ అనంతరం అప్పలరాజును కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు
సాయంత్రం 5 గంటల వరకూ కస్టడీకి అనుమతిచ్చిన న్యాయస్థానం
-
Aug 04, 2026 16:06 IST
హైదరాబాద్: రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
రేపు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు
తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చ
-
Aug 04, 2026 16:05 IST
హైదరాబాద్: భూములను కాపాడటానికే హైడ్రా: ప్రభుత్వ సలహాదారు వీహెచ్
బతుకమ్మ కుంటని కబ్జా చేయాలని చూశారు: వి.హనుమంతరావు
చెరువులు, ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడుతోంది: వీహెచ్
కోర్టులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు: వి.హనుమంతరావు
-
Aug 04, 2026 16:04 IST
అమరావతి: మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో సదరం సేవలు
దివ్యాంగులకు సదరం సేవలు మరింత సులభతరం
మనమిత్ర ద్వారానే సదరం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సదరం సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నెంబరు 9552300009కు హాయ్ అని మెసేజ్ పంపి, సదరం సేవలు పొందవచ్చు
సేవలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి: ఆర్టీజీఎస్
-
Aug 04, 2026 15:53 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
210 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
159 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Aug 04, 2026 15:43 IST
హైదరాబాద్: కాచిగూడలో 68.90 గ్రాముల చరస్ స్వాధీనం
చరస్ సహా 154 క్వార్టర్ మద్యం బాటిళ్ల స్వాధీనం, హర్యానా వాసి విక్రమ్ అరెస్ట్
ఎక్సైజ్ సహా NDPS చట్టం కింద కేసు నమోదు
-
Aug 04, 2026 15:40 IST
విద్యార్థులపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ అర్వింద్
విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ నాశనం చేస్తున్నారు: ఎంపీ అర్వింద్
విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు: అర్వింద్
విద్య పట్ల చిత్తశుద్ధి లేనివ్యక్తి.. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు: అర్వింద్
విద్యాశాఖను శ్రీధర్‌బాబుకు అప్పగిస్తే బాగుంటుంది: అర్వింద్
విద్యాశాఖ మంత్రిగా ఒక్క పాఠశాలకైనా రేవంత్ వెళ్లారా?: ఎంపీ అర్వింద్
-
Aug 04, 2026 15:40 IST
హైదరాబాద్: గాంధీభవన్ ఎదుట భూ భారతి ఉద్యోగుల నిరసన
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
తమను విధుల నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోందని ఆవేదన
-
Aug 04, 2026 15:27 IST
తాడేపల్లి: వైసీపీపై రివర్స్ అటాక్ మొదలుపెట్టిన బోరుగడ్డ అనిల్
తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు బోరుగడ్డ నిరసన
జగన్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఆందోళన
సజ్జల రామకృష్ణారెడ్డి క్షమాపణ చెప్పాలి: బోరుగడ్డ అనిల్
-
Aug 04, 2026 15:22 IST
లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో ఏపీ డెయిరీ డేటా వెల్లడించిన కేంద్రం
వైసీపీ పాలనలో ఏపీ పాడి పరిశ్రమ కుదేలైంది: కేంద్రం
జగన్ పాలనలో పాల ఉత్పత్తి 15.45 మిలియన్ టన్నుల నుంచి 13.95 మిలియన్ టన్నులకు పడిపోయింది
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ డెయిరీ రంగానికి మద్దతుగా రూ.115.65 కోట్లు: కేంద్రం
పశుసంవర్ధక మౌలిక వసతుల నిధి రూ.6.57 కోట్లకు పెంపు
-
Aug 04, 2026 14:59 IST
హైదరాబాద్: సచివాలయంలో టీ-ఫైబర్‌పై మంత్రి శ్రీధర్ బాబు కీలక సమీక్ష
సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్
గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకూ ఇంటర్నెట్ కల్పించాలని ఆదేశం
సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఇంటర్నెట్ బిల్లులను చెల్లించొద్దని మంత్రి స్పష్టం
టీ-స్వాన్ నెట్‌వర్క్‌ను నెల రోజుల్లో టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలని ఆదేశం
-
Aug 04, 2026 14:36 IST
లోక్‌సభ రేపటికి వాయిదా
సభలో కొనసాగిన విపక్షాల ఆందోళన
విపక్షాల ఆందోళన మధ్యే లోక్‌సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం
వెంటనే సభలో చర్చకు పెట్టగా.. గందరగోళం మధ్యే ఆమోదం
మూజువాణి ఓటుతో ఆమోదం
-
Aug 04, 2026 14:33 IST
హైదరాబాద్: హరీశ్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారు: మహేశ్ గౌడ్
క్షుద్ర పూజలపై అన్ని అధారాలూ ఉన్నాయి: మహేశ్ గౌడ్
తిరుచ్చి, శివమొగ్గకు ఎందుకు వెళ్లారు?: మహేశ్ గౌడ్
వాళ్లకు రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు: మహేశ్ గౌడ్
-
Aug 04, 2026 14:32 IST
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట
ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్ మంజూరు
ఉదయనిధిని వెంటనే విడుదల చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశం
-
Aug 04, 2026 13:43 IST
ఎయిరిండియా విమానానికి తప్పినముప్పు
గాల్లో ఉన్న సమయంలో విమానంలో కుదుపులు
విమానంలో కుదుపులతో పలువురికి గాయాలు
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండింగ్
సిబ్బందికి ఎయిర్‌పోర్ట్‌లో ప్రాథమిక వైద్యం
ఫుకెట్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఘటన
-
Aug 04, 2026 13:38 IST
కర్ణాటక: ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పందించిన సీఎం డీకే
రాజీనామా చేయాలనుకునే వారిని ఎవరూ ఆపలేరు: డీకే
పార్టీ ఉంటేనే రాజకీయ భవిష్యత్: డీకే
పార్టీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి: డీకే
-
Aug 04, 2026 13:37 IST
కర్ణాటక కాంగ్రెస్‌లో కేబినెట్ విస్తరణపై అసంతృప్తి
విస్తరణలో 19 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా
ఎమ్మెల్యే యశవంతరాయగౌడ పాటిల్ రాజీనామా
సాగర్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ రాజీనామా
-
Aug 04, 2026 12:51 IST
డీఎస్సీ-2025పై ఏపీ హైకోర్టులో విచారణ
సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి పిల్‌లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ
స్పోర్ట్స్ కోటాతో నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టుకు ఎందుకు ఆశ్రయించడం లేదు?: హైకోర్టు
బాధిత అభ్యర్థులు నేరుగా కోర్టును ఆశ్రయించేందుకు భయపడుతున్నారన్న వాదనతో ఏకీభవించలేం: హైకోర్టు
-
Aug 04, 2026 12:21 IST
తమిళనాడు: తంజావూర్‌లో ఉద్రిక్తత
తంజావూర్‌కు ఉదయనిధి స్టాలిన్ తరలింపు
తంజావూర్‌లో డీఎంకే నేతల ఆందోళన
సీఎం విజయ్ దిష్టిబొమ్మ దగ్ధం, అడ్డుకున్న టీవీకే కార్యకర్తలు
పరస్పరం రాళ్ల దాడులు, అడ్డుకున్న పోలీసులు
ఇరు పార్టీలను చెదరగొట్టిన పోలీసులు
-
Aug 04, 2026 12:15 IST
కడప: నగరంలోని దండోరా కాలనీలో దారుణం
ఒకే కుటుంబంలో రెండు పరువు హత్యలు
ప్రేమించిందని కుమార్తెను దారుణంగా హత్య చేసిన తండ్రి
కుమార్తెతో పాటు తన తల్లిని కూడా చంపిన నిందితుడు బాబు
కూతుర్ని, తల్లిని ఇద్దరిని చంపి పరారైన బాబు
-
Aug 04, 2026 12:00 IST
చెన్నై: పోలీసుల తీరుపై ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం
అరెస్ట్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటా: ఉదయనిధి స్టాలిన్
పోలీసుల అరెస్ట్‌ను జోక్‌గా తీసుకుంటున్నా: ఉదయనిధి
-
Aug 04, 2026 11:48 IST
హైదరాబాద్: పంజాగుట్ట నిమ్స్‌లో దారుణ ఘటన..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పట్ల మరో పేషెంట్ అటెండెంట్ అనుచిత ప్రవర్తన
తెల్లవారుజామున 3-4 గంటల మధ్య ఘటన
కుటుంబ సభ్యులకు విషయం చెప్పిన బాధితురాలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి తండ్రి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 04, 2026 11:45 IST
ఏలూరు: జీలుగుమిల్లి మండలం దర్భగూడెం, సిర్రివారిగూడెం ప్లాంటేషన్‌లో పెద్దపులి సంచారం
పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఫారెస్ట్ అధికారులు
గత ఆరు రోజులుగా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలలో సంచరిస్తున్న పెద్దపులి
-
Aug 04, 2026 11:44 IST
జనగామ జిల్లాలో దారుణ ఘటన
భార్యపై దాడి చేసి పిల్లలను ఎత్తుకెళ్లిన భర్త
భర్తకు మరో మహిళతో ఎఫైర్ ఉందని నిలదీసిన భార్య
ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవ.. భార్యపై బ్యాట్‌తో దాడి చేసిన భర్త
భార్య ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Aug 04, 2026 11:27 IST
ఢిల్లీ: రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా
అధికార, విపక్ష ఎంపీల ఆందోళన నడమ సభ వాయిదా
-
Aug 04, 2026 11:23 IST
మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ఉదయనిధి స్టాలిన్
ముందస్తు బెయిల్ కోరుతూ ఉదయనిధి పిటిషన్
అత్యవసర విచారణకు స్వీకరించిన కోర్టు
మధ్యాహ్నం ఉదయనిధి స్టాలిన్ పిటిషన్‌పై విచారణ
సీఎం, త్రిషపై అనుచిత వ్యాఖ్యల కేసులో తంజావూర్‌లో ఉదయనిధి స్టాలిన్‌పై కేసు
ఉదయనిధిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు
-
Aug 04, 2026 11:17 IST
ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
విపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా
-
Aug 04, 2026 11:12 IST
చెన్నై: ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్..
-
Aug 04, 2026 10:47 IST
త్రిషను ఉద్దేశిస్తూ డబుల్ మీనింగ్ కామెంట్స్.. ఉదయనిధిపై కేసు
తంజావూర్ పోలీస్ స్టేషన్‌లో డీఎంకే నేతపై కేసు నమోదు
కావేరీ నదీ జలాల అంశంపై ర్యాలీలో ఉదయనిధి కామెంట్స్ వివాదాస్పదం
ఉదయనిధిపై టీవీకే, బీజేపీ ఫైర్
తమిళనాడు మహిళలు అసభ్య వ్యాఖ్యలు సహించరన్న టీవీకే
-
Aug 04, 2026 10:38 IST
గుంటూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ ప్రాంతంలో పులి మృతి కేసులో పురోగతి
ఇద్దరు అనుమానితులను గుంటూరు జిల్లా మేడికొండూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
పోలీసుల అదుపులో గిద్దలూరుకు చెందిన అంజి, నంద్యాల జిల్లాకు చెందిన వీరాంజనేయులు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులి మృతిపై దర్యాప్తు
-
Aug 04, 2026 10:37 IST
అమరావతి: గుజరాత్‌లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్
ఇటీవల ఇద్దరిని కిడ్నాప్ చేసి నిర్భంధించారని కేసు నమోదు
అప్పటి నుంచి పరారీలో ముస్తఫా
సాంకేతిక పరిజ్ఞానంతో గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించిన నూజివీడు పోలీసులు
మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్‌ను ధృవీకరించిన పోలీసులు
-
Aug 04, 2026 10:21 IST
ఢిల్లీ: లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ
కొత్త ఫిరాయింపుల నిరోధక చట్టంపై చర్చించాలని డిమాండ్
-
Aug 04, 2026 10:20 IST
విశాఖ: పాత గంగవరం బీచ్‌లో కొనసాగుతున్న గాలింపు
ఇంకా లభించని యువతి, యువకుడి ఆచూకీ
మూడో రోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు
నేవీ, కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్లతో గాలింపు
ఈ నెల 2న గల్లంతైన నీతూ, దామోదర్
-
Aug 04, 2026 10:19 IST
యూపీ: నోయిడాలోని కంపెనీలో అగ్నిప్రమాదం
మంటలార్పుతుండగా గోడ కూలి ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి
మరో ఆరుగురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Aug 04, 2026 10:19 IST
PoKలో పాక్ ప్రభుత్వ అణచివేతపై ఆమ్నెస్టీ ఆగ్రహం
జర్నలిస్టుల మిస్సింగ్, కమ్యూనికేషన్ల నిలిపివేతపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన
PoKలో ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిపివేసిన పాకిస్థాన్
-
Aug 04, 2026 10:18 IST
తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం
సీఎం విజయ్, త్రిషపై ఉదయనిధి అనుచిత వ్యాఖ్యలు
నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు TVK పిలుపు
-
Aug 04, 2026 09:48 IST
ఢిల్లీ: యూపీఐపై ఛార్జీలు లేవు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
రూ.3,000 దాటిన చెల్లింపులపైనా ఎండీఆర్ ఉండదు: కేంద్రం
యూపీఐ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయి: కేంద్రం
ఛార్జీలపై వస్తున్న ప్రచారం అవాస్తవమని కేంద్రం వెల్లడి
-
Aug 04, 2026 09:11 IST
ఢిల్లీ: ద్విచక్ర వాహన అంబులెన్సులకు అనుమతిపై కేంద్రం కీలక నిర్ణయం
కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989కి సవరణల ప్రతిపాదన
గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన వైద్య సేవలే లక్ష్యంగా నిర్ణయం
ఎల్2 కేటగిరీ ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా వినియోగానికి అనుమతి
అంబులెన్సుల నిర్వహణ, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్‌కు ప్రత్యేక నిబంధనలు
రాష్ట్రాలు నిర్దేశించిన ప్రాంతాల్లోనే ద్విచక్ర అంబులెన్సులకు అనుమతి
ముసాయిదా నోటిఫికేషన్‌పై 30 రోజుల్లో అభ్యంతరాలు తెలపొచ్చు
సూచనలు పరిశీలించిన తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేయనున్న కేంద్రం
-
Aug 04, 2026 08:59 IST
అనంతపురం: ఉరవకొండ ఘటనలో వైసీపీ నేతలపై కేసు నమోదు
హెడ్ కానిస్టేబుల్ అంజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు
విశ్వేశ్వరరెడ్డితో పాటు 20 మంది కార్యకర్తలపై కేసులు నమోదు
-
Aug 04, 2026 08:58 IST
కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు దగ్గర రోడ్డు ప్రమాదం
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ప్రైవేట్ బస్సు బోల్తా
చెన్నై నుంచి విశాఖ వెళ్తున్న ప్రైవేట్ బస్సు
బస్సులోని ముగ్గురికి తీవ్ర గాయాలు, మరో 12 మందికి స్వల్ప గాయాలు
ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు
-
Aug 04, 2026 08:54 IST
సంగారెడ్డి: నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లిలో దారుణం
కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త
భార్య ఇర్ఫానా (32)ను హత్య చేసిన సయ్యద్ ముల్తాన్
నాగల్‌గిద్ద పీఎస్‌లో లొంగిపోయిన ముల్తాన్
-
Aug 04, 2026 08:45 IST
ట్రంప్ సుంకాలపై మరో కేసు.. కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు
వెట్టిచాకిరీని అడ్డుకోవడంలో పలు దేశాలు విఫలం అయ్యాయన్న ట్రంప్
భారత్ సహా 60 దేశాలపై 12.5 శాతం వరకూ సుంకం విధింపు
సుంకాల విధింపును సవాలు చేస్తూ కోర్టుకెక్కిన 25 అమెరికన్ రాష్ట్రాలు
ట్రంప్ తన అధికార పరిధిని మీరారని ఆరోపణ
-
Aug 04, 2026 08:24 IST
దులీప్ ట్రోఫీ: నార్త్ జోన్ జట్టు ప్రకటన
కెప్టెన్‌గా ఎంపికైన జమ్ముకశ్మీర్ బ్యాటర్ కన్హయ్య వాధ్వాన్
భారత స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, బ్యాటర్ ఆయుష్ బదోనిలకు ఛాన్స్
అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లకు దక్కని అవకాశం
ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ
-
Aug 04, 2026 08:24 IST
హెచ్-1 రెన్యువల్‌పైనా ఫీజులు.. అమెరికా కొత్త ప్రతిపాదన
9-11 రెస్పాన్స్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు పరిధిని విస్తరించేందుకు ప్లాన్
బడా కంపెనీల హెచ్-1బీ, ఎల్-1బీ పిటిషన్లకు వర్తించే దిశగా ప్రతిపాదన
ఇప్పటివరకూ కొత్త పిటిషన్లు, కంపెనీ మార్పుల సందర్భాల్లోనే ఫీజులు
ఇకపై రెన్యూవల్‌కూ వర్తించే ఛాన్స్
-
Aug 04, 2026 08:21 IST
నేడు ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష
ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు
-
Aug 04, 2026 07:57 IST
కేరళంలో భారీ వర్షాలు..
15కి చేరిన మృతుల సంఖ్య
-
Aug 04, 2026 07:56 IST
గుజరాత్: చండీపుర వైరస్ కలకలం
చండీపుర వైరస్‌తో 22 మంది చిన్నారుల మృతి
184 అనుమానిత కేసులు నమోదు, 35 మందికి వైరస్ నిర్ధారణ
గుజరాత్‌లో పలు జిల్లాలకు విస్తరించిన వైరస్
-
Aug 04, 2026 07:32 IST
అనకాపల్లి: ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం
యలమంచిలి మం. పులపర్తి దగ్గర ఘటన
బస్సులో చెలరేగిన మంటలు
-
Aug 04, 2026 07:30 IST
తెలంగాణలో భారీ వర్షాలు
కామారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Aug 04, 2026 07:28 IST
నేడు ఏపీలో పలుచోట్ల వర్షాలు
అల్లూరి, పోలవరం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో వర్షాలు