Share News

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. సూచీలకు నష్టాలు..

ABN , Publish Date - Aug 04 , 2026 | 04:05 PM

వరుసగా నాలుగు సెషన్ల పాటు లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం కిందకు దిగి వచ్చాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టాల బాటలో నడిచాయి.

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. సూచీలకు నష్టాలు..
Stock Market

వరుసగా నాలుగు సెషన్ల పాటు లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం కిందకు దిగి వచ్చాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టాల బాటలో నడిచాయి. దాదాపు అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆఫర్ ఫర్ సేల్ ప్రకటించడంతో ఎల్‌ఐసీ దాదాపు 9 శాతం నష్టపోయింది. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.38) బలహీనపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను చవిచూశాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (78,639)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారకుంది. ఒక దశలో 400 పాయింట్లు కోల్పోయి 78,211 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో 78,428 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 159 పాయింట్ల నష్టంతో 24,614 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో కేఈఐ ఇండస్ట్రీస్, సీజీ పవర్, సెయిల్, గాడ్‌ఫ్రే ఫిలిప్, నిప్పాన్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఎల్‌ఐసీ ఇండియా, యూపీఎల్, ప్రెస్టిజ్ ఎస్టేట్, ఒబెరాయ్ రియాల్టీ, డాబర్ ఇండియా మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 340 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 187 పాయింట్లు నష్టపోయింది.


ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు


ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..

Updated Date - Aug 04 , 2026 | 04:06 PM