ఎయిర్ ఇండియా విమానంలో తీవ్రమైన కుదుపులు.. 12 మందికి స్వల్ప గాయాలు
ABN , Publish Date - Aug 04 , 2026 | 02:46 PM
థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో తీవ్ర గాలిపోటు (టర్బులెన్స్) ఏర్పడింది. ఈ ఊహించని పరిణామంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడగా, విమానం కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
ఢిల్లీ, ఆగస్టు 4: ఫుకెట్ (థాయ్‌లాండ్) నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం అనుకోకుండా తీవ్ర కుదుపులు(టర్బులెన్స్) ఏర్పడ్డాయి. ఈ ఊహించని పరిణామంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడగా, విమానం కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
జరిగిందేమిటంటే?
ఇవాళ (ఆగస్టు 4) 134 మంది ప్రయాణికులతో ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన AI379 ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా తీవ్రమైన కుదుపులకు గురైంది. దీనివల్ల క్షణాల వ్యవధిలోనే విమానం ఎత్తు (ఆల్టిట్యూడ్) ఒక్కసారిగా పడిపోయింది.
విమానంలో ఉన్న ప్రయాణికుడు ఒకరు మాట్లాడుతూ... 'విమానం ఎత్తు ఒక్కసారిగా తగ్గిపోవడంతో నా తల పైభాగంలో (రూఫ్) గట్టిగా తగిలి కింద పడిపోయాను' అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఎయిర్ ఇండియా ప్రకటన, సహాయక చర్యలు
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం అధికారికంగా స్పందించింది. విమానం ప్రయాణికులందరితో సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, అందరూ క్షేమంగా బయటకు వచ్చారని తెలిపింది. గాయపడిన 12 మందిలో ఇద్దరు క్యాబిన్ సిబ్బంది కూడా ఉన్నారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని, కేవలం స్వల్ప గాయాలే అయ్యాయని సంస్థ పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యగా బాధితులను ఎయిర్‌పోర్టులోని వైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తమ మొదటి ప్రాధాన్యమని, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని విమాన సంస్థ తెలిపింది. ఈ ఘటనపై సంబంధిత అధికారుల దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి...
కిడ్నాప్ కేసు.. గుజరాత్‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్
పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్
Read Latest AP News And Telugu News