Share News

కిడ్నాప్ కేసు.. గుజరాత్‌‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్

ABN , Publish Date - Aug 04 , 2026 | 09:47 AM

గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గుజరాత్‌లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు.

కిడ్నాప్ కేసు.. గుజరాత్‌‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్
YCP Leader Mustafa Arrest

అమరావతి, ఆగస్టు 4: గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గుజరాత్‌లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి నిర్భంధించారంటూ వైసీపీ నేతపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న ముస్తఫా కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకుని వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. ముస్తఫా అరెస్ట్‌ను పోలీసులు ధృవీకరించారు.


ఇటీవల పొగాకు లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ముస్తఫా కుమారుడు, అతడి అనుచరులు అడ్డుకున్నారు. పొగాకు వ్యాపారి‌తో పాటు మరొకరిని బలవంతంగా కిడ్నాప్ చేసి, నిర్బంధించారు. బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌కు గురైన వారిని రక్షించిన పోలీసులు.. ఐదుగురిని అరెస్ట్ చేశారు. ముస్తఫా కుమారుడిపై కిడ్నాప్ కేసును నమోదు చేశారు. అంతేకాకుండా కిడ్నాప్‌‌లో ముస్తఫా హస్తం కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతడిపై కూడా కిడ్నాప్, బెదిరింపుల కేసు నమోదు చేశారు. దీంతో అప్పటి నుంచి ముస్తఫా కనిపించకుండా పోయారు. వైసీపీ నేత కోసం గాలించిన పోలీసులు.. చివరకు ఆయనను గుజరాత్‌లో అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

హెచ్-1బీ వీసా రెన్యువల్‌పైనా అదనపు ఫీజులు.. అమెరికా కొత్త ప్రతిపాదన

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 100 టీఎంసీలకు చేరువలో..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 04 , 2026 | 09:53 AM