Share News

హెచ్-1బీ వీసా రెన్యువల్‌పైనా అదనపు ఫీజులు.. అమెరికా కొత్త ప్రతిపాదన

ABN , Publish Date - Aug 04 , 2026 | 08:30 AM

వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కారు మరో వీసా ఫీజును తెరపైకి తెచ్చింది.

హెచ్-1బీ వీసా రెన్యువల్‌పైనా అదనపు ఫీజులు.. అమెరికా కొత్త ప్రతిపాదన
Additional Fee on H-1b Visa Renewals

ఇంటర్నెట్ డెస్క్: వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కారు మరో వీసా ఫీజును తెరపైకి తెచ్చింది. బడా కార్పొరేషన్ల హెచ్-1బీ, ఎల్-1 పిటిషన్ల రెన్యువల్స్‌పై అదనపు ఫీజు విధించేలా ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. ఈ దిశగా 9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజును వీసా రెన్యూవల్స్‌కు వర్తించేలా రూపొందించిన నిబంధనలు తుది రూల్ మేకింగ్ దశకు చేరుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది అమల్లోకి వస్తే కంపెనీలకు హెచ్-1బీ వీసాదారులను కొనసాగించడం మరింత భారంగా మారుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


సగానికి పైగా హెచ్-1బీ వీసాదారులు, ఎల్-1వీ వీసాదారులు ఉన్న అమెరికన్ కంపెనీలపై ఈ అదనపు ఫీజును విధించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, కార్మిక శాఖ, విదేశాంగ శాఖ కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి బడా సంస్థలు కొత్త విదేశీ వర్కర్లను స్పాన్సర్ చేసే సమయంలో హెచ్-1బీ, ఎల్-1 పిటిషన్లపై అదనంగా 4 వేల డాలర్ల ఫీజును చెల్లిస్తున్నాయి. ఇకపై విదేశీ ఉద్యోగిని కొనసాగించేందుకు చేసే రెన్యూవల్స్‌ విషయంలోనూ ట్రంప్ సర్కారు అదనపు ఫీజు విధించే అవకాశం ఉంది.


అమెరికా పౌరసత్వ, వలస సేవల శాఖ లెక్కల ప్రకారం, ప్రభుత్వం జారీ చేసే హెచ్-1బీ అనుమత్లో అధిక శాతం రెన్యువల్స్‌కు సంబంధించినవే. 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 4.06 లక్షల హెచ్-1బీ అప్లికేషన్లను ఆమోదించగా వాటిల్లో 71 శాతం రెన్యూవల్స్‌కు సంబంధించినవేనని తేలింది. కాబట్టి ఈ ఫీజు కూడా అమల్లోకి వస్తే భారతీయులపై మరింత భారం పెరిగే అవకాశం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

డీల్ చేసుకోండి లేదా పూర్తిగా లొంగిపోండి.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..

30 మంది లష్కరే సభ్యులను గుర్తు తెలియని వ్యక్తులు చంపారు.. ఉగ్రవాది అంగీకారం..

Updated Date - Aug 04 , 2026 | 09:08 AM