30 మంది లష్కరే సభ్యులను గుర్తు తెలియని వ్యక్తులు చంపారు.. ఉగ్రవాది అంగీకారం..
ABN , Publish Date - Aug 03 , 2026 | 09:42 PM
పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయ్యిబాకు చెందిన కీలక సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ తాజాగా సంచలన విషయాలను వెల్లడించాడు. రిజ్వాన్‌కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయ్యిబాకు చెందిన కీలక సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ తాజాగా సంచలన విషయాలను వెల్లడించాడు. రిజ్వాన్‌కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. గత మూడు, నాలుగేళ్లలో పాకిస్థాన్‌తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో మరణించారని అతడు అంగీకరించాడు (Lashkar-e-Taiba Terrorists).
పెషావర్, కరాచీ, రావల్పిండి, రావలాకోట్, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ హత్యలు చోటుచేసుకున్నాయని రిజ్వాన్ వెల్లడించాడు. గత కొన్నేళ్లుగా తమ సంస్థ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలు జరుగుతున్నాయని అతడు పేర్కొన్నాడు. లష్కరేకు చెందిన వ్యక్తి బహిరంగంగా ఇలాంటి విషయాన్ని అంగీకరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం (LeT Rizwan Hanif).
ఈ హత్యల వెనుక భారత సంస్థలు ఉన్నాయని ఆ వీడియోలో రిజ్వాన్ ఆరోపించాడు. అయితే భారత్ ఆ ఆరోపణలను తిరస్కరించింది. కాగా, వీడియోలో ఉన్నది భారత్‌కు కావాల్సిన లష్కరే సీనియర్ ఉగ్రవాది రిజ్వాన్ అని, వీడియో నిజమైనదేనని భారత నిఘా సంస్థలు ధ్రువీకరించాయి (Pak Terror Group).
2008 ముంబై ఉగ్రదాడులతో సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో మారణ హోమాలకు పాల్పడిన లష్కరే తొయ్యిబాను ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. అలాంటి సంస్థకు చెందిన సభ్యులు వరుసగా హతమవుతుండడం సంచలనంగా మారింది. అయితే ఈ హత్యల వెనుక ఎవరు ఉన్నారనే విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణా లేదు.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..