జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాలి.. ప్రధాని వీడియో తొలగింపుపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం..
ABN , Publish Date - Aug 03 , 2026 | 08:44 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేసిన ఘటన గురించి మెటా ప్రతినిధులు సోమవారం పార్లమెంటరీ స్థాయి కమిటీ ముందు వివరణ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేసిన ఘటన గురించి మెటా ప్రతినిధులు సోమవారం పార్లమెంటరీ స్థాయి కమిటీ ముందు వివరణ ఇచ్చారు. మెటా ఈ ఘటనను సాంకేతిక లోపంగా పేర్కొంటూ క్షమాపణ చెప్పినా, అది మాత్రమే సరిపోదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా తీసుకునే చర్యలపై వివరాలు కోరినట్లు సమాచారం (Mark Zuckerberg Apology).
పార్లమెంటరీ స్థాయి సమాచార సాంకేతిక కమిటీ ఛైర్మన్ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియోను తొలగించినందుకు మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాలి' అన్నారు. సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలను, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. తమ ప్లాట్‌ఫామ్‌లలో బాలల లైంగిక వేధింపుల (CSAM) కంటెంట్‌పై కూడా మెటా అధికారులు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది (PM Modi Facebook Video).
సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు (Parliament Panel Meta). వీడియో తొలగింపుపై మెటా ఇచ్చిన సాంకేతిక లోపం వివరణ తగినది కాదని, ప్లాట్‌ఫామ్‌లోని ఆల్గోరిథమ్‌లు, కంటెంట్ మోడరేషన్ విధానాలపై కూడా వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి జవాబుదారీతనాన్ని నిర్ధారించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..