బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..
ABN , Publish Date - Aug 03 , 2026 | 03:20 PM
బరువు తగ్గడం కోసం జనాలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తక్కువ రోజుల్లో సులభంగా బరువు తగ్గించే చిట్కాల వైపు ఆకర్షితులవుతుంటారు. ప్రస్తుతం చైనాలో అలాంటిదే ఓ వెయిట్ లాస్ ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది.
బరువు తగ్గడం కోసం జనాలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తక్కువ రోజుల్లో సులభంగా బరువు తగ్గించే చిట్కాల వైపు ఆకర్షితులవుతుంటారు. ప్రస్తుతం చైనాలో అలాంటిదే ఓ వెయిట్ లాస్ ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది. చైనాలో చాలా మంది బరువు తగ్గడం కోసం టీలో ద్రవ ఔషధమైన గ్లిజరిన్ ఎనిమాను కలిపి తాగుతున్నారు. ఇది తాగడం ద్వారా రెండు రోజుల్లో 4 కిలోల వరకు బరువు తగ్గవచ్చని వారు వాదిస్తున్నారు (China weight loss trend).
నిజానికి గ్లిజరిన్ ఎనిమా అనేది మలబద్ధకాన్ని నివారించే ఒక ఔషధం. ఇది తాగిన కొద్ది నిమిషాల్లోనే కడుపు మొత్తం క్లీన్ అవుతుంది. గ్లిజరిన్ ఎనిమా ద్వారా బరువు తగ్గాలని ప్రయత్నించి చాలా మంది ఆస్పత్రులపాలయ్యారు. వైరల్ వీడియోలను చూసి ఈ టీని తాగిన పలువురికి తీవ్రమైన విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, నీరసం వంటి సమస్యలు తలెత్తాయి. కొందరికి పరిస్థితి విషమించి అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చింది (Tea and laxative).
ఈ టీ తాగడం వల్ల కనిపించే బరువు తగ్గుదల కొవ్వు కరగడం వల్ల కాదు (viral weight loss trend). శరీరంలో నీరు, పేగుల్లోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడం వల్ల తాత్కాలికంగా బరువు తగ్గినట్లు కనిపిస్తుంది. శరీరానికి మళ్లీ తగినంత నీరు అందిన వెంటనే బరువు తిరిగి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్లిజరిన్ ఎనిమాను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినడం, తీవ్రమైన నిర్జలీకరణకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో టెస్టు సిరీస్: బుమ్రా ఔట్.. ఆకిబ్ నబీకి ఛాన్స్
బుమ్రా కాదు.. అర్ష్‌దీప్ సింగ్‌కు నచ్చిన టాప్-5 బౌలర్లు వీరే!