బుమ్రా కాదు.. అర్ష్‌దీప్ సింగ్‌కు నచ్చిన టాప్-5 బౌలర్లు వీరే!
ABN , Publish Date - Aug 03 , 2026 | 10:00 AM
భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తనకు నచ్చిన టాప్-5 భారత బౌలర్ల జాబితాను వెల్లడించాడు. అయితే ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ జాబితాలో చోటు లేకపోవడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తనకు నచ్చిన టాప్-5 భారత బౌలర్ల జాబితాను వెల్లడించాడు. అయితే ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ జాబితాలో చోటు లేకపోవడం గమనార్హం. అయితే ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అర్ష్‌దీప్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
తన వ్యక్తిగత అభిరుచి కారణంగా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను టాప్ ప్లేస్‌లో ఉంచినట్లు అర్ష్‌దీప్ తెలిపాడు. ‘భువీ భాయ్ అంటే నాకు ఎంతో ఇష్టం. కొత్త బంతితో ఆయన బౌలింగ్ చేస్తే కనులవిందుగా అనిపిస్తుంది. అందుకే టాప్-5లో ఫస్ట్ ప్లేస్ భువీ భాయ్‌కే ఇస్తా. ఏ పిచ్‌పై అయినా బంతిని సీమ్ చేయగల సామర్థ్యం మహ్మద్ షమీకి ఉంది. ఆయన సీమ్ ప్రజెంటేషన్ అసాధారణం. షమీ భాయ్ రెండో స్థానంలో ఉంటారు. మూడు, నాలుగో స్థానాల్లో కుల్‌దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉంటారు. కుల్‌దీప్ అరుదైన ఎడమచేతి చైనామన్ స్పిన్నర్. చాహల్‌తో పంజాబ్ జట్టులో కలిసి ఆడుతున్నాను. అతని వికెట్ల రికార్డు అద్భుతంగా ఉంది. ఐదో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఉంటారు. అశ్విన్ భాయ్‌ను చివర్లో ఉంచాలని లేదు. కానీ స్పేస్ ఎక్కువ లేకపోవడం వల్ల ఐదో స్థానంలో పెట్టాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున నా తొలి కెప్టెన్ ఆయనే. ఆఖరి స్థానంలో ఎంపిక చేసినందుకు ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతా’ అంటూ అర్ష్‌దీప్ సింగ్ సరదాగా స్పందించాడు. అయితే జస్‌ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజ పేసర్‌కు అర్ష్‌దీప్ జాబితాలో చోటు దక్కకపోవడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఇవి కూడా చదవండి:
కుల్‌దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు
టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఘోష్ నియామకం