డీల్ చేసుకోండి లేదా పూర్తిగా లొంగిపోండి.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..
ABN , Publish Date - Aug 04 , 2026 | 06:50 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని.. అలాకాకపోతే పూర్తిగా లొంగిపోవాలని తేల్చి చెప్పారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని.. అలాకాకపోతే పూర్తిగా లొంగిపోవాలని తేల్చి చెప్పారు. సోమవారం తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్ సోషల్‌లో ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇరాన్ చర్చల కోసం తమను ప్రాధేయపడిందని, ఇప్పుడు బహిరంగంగా చర్చలు కుదరవంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇరాన్ దీన్ని అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. దశాబ్దాలుగా వాళ్లు సృష్టించిన ఓ సమస్యకు పరిష్కారం గురించి మేము మాట్లాడుతున్నాం. హోర్ముజ్‌పై తమ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ నాయకత్వం ఎప్పటిలాగే వ్యర్థమైన మాటలు చెబుతోంది. కానీ, హోర్ముజ్ జలసంధి ఇప్పటికే అమెరికా నియంత్రణలో ఉంది. హోర్ముజ్ ‘ది యునైటెడ్ స్టేట్స్ వాల్ ఆఫ్ స్టీల్’ కంట్రోల్‌లో ఉంది. జలసంధిలో ప్రయాణం పూర్తిగా అమెరికా ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు’ అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు