దివ్యాంగులకు గుడ్ న్యూస్.. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం సేవలు..
ABN , Publish Date - Aug 04 , 2026 | 04:22 PM
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు సదరం సేవలు మరింత చేరువ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు సదరం సేవలు మరింత చేరువ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా ఈ సేవలను అందించేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేసింది. ఈ మేరకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కీలక వివరాలను వెల్లడించింది.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు ఆర్టీజీఎస్ పేర్కొంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009కు ‘హాయ్’ అని మెసేజ్ పంపాలని, అనంతరం సదరం సేవలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. మనమిత్ర ద్వారా దివ్యాంగులు సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చని, అలాగే స్లాట్ లభ్యతను తెలుసుకోవచ్చని తెలిపింది. అదేవిధంగా సర్టిఫికెట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ సదుపాయాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి
‘జగన్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వండి’.. తాడేపల్లిలో బోరుగడ్డ అనిల్ నిరసన
వైఎస్ జగన్ హయాంలో డెయిరీ రంగం కుదేలు.. లోక్‌సభ వేదికగా కేంద్రం గణాంకాలు వెల్లడి..