-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 29th August 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 29 , 2026 | 06:58 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Aug 29, 2026 07:17 IST
నేపాల్ వరదలపై భారత విదేశాంగ శాఖ ప్రకటన
నేపాల్ వరదల్లో 320 మంది భారతీయుల గల్లంతు: విదేశాంగ శాఖ
చైనాలో ఉన్న 400 మంది భారతీయులు క్షేమం: విదేశాంగ శాఖ
-
Aug 29, 2026 07:16 IST
నేపాల్ విలయంలో అస్సాంకు చెందిన 12 మంది గల్లంతు
12 మందిని సురక్షితంగా రక్షించేందుకు చర్యలు
కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నాం: అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది: సీఎం బిశ్వశర్మ
-
Aug 29, 2026 07:15 IST
అమెరికా: న్యూయార్క్‌లో RSS చీఫ్ మోహన్ భాగవత్ పర్యటన
నిరాశ్రయులకు ఆహార పంపిణీలో పాల్గొన్న RSS చీఫ్
ఇస్కాన్ 60వ వార్షికోత్సవంలో పాల్గొననున్న భాగవత్
-
Aug 29, 2026 07:14 IST
ఢిల్లీ: చక్కెర ధరలు, నిల్వలు, సరఫరాపై కేంద్రం నిఘా
మిల్లుల్లో అంచనాలకు మించి చక్కెర నిల్వల గుర్తింపు
కేంద్రం చర్యలతో చక్కెర మార్కెట్‌లో పెరిగిన లభ్యత
ఎక్స్-మిల్ చక్కెర ధరలు 20 శాతం తగ్గుదల
రిటైల్ చక్కెర ధరల్లోనూ తగ్గుదల
-
Aug 29, 2026 07:13 IST
తెలంగాణలోనూ పలు జిల్లాలకు వర్షసూచన
మరో 24 గంటల పాటు హైదరాబాద్‌కు వర్ష సూచన
తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం
-
Aug 29, 2026 07:13 IST
నేపాల్ నుంచి తమిళనాడు చేరుకున్న 21 మంది యాత్రికులు
కైలాష్ యాత్రకు వెళ్లి చిక్కుకుపోయిన బాధితులు
21 మందికి స్వాగతం పలికిన తమిళనాడు మంత్రి
-
Aug 29, 2026 07:12 IST
నేడు తమిళనాడులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన
ఈరోడ్‌లో KVITT వేడుకలకు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి
-
Aug 29, 2026 07:05 IST
నేటి నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన
ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్ దేశాల్లో పర్యటించనున్న మోదీ
భారత్-ఉజ్బెకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చలు
డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్యా రంగాలపై చర్చలు
-
Aug 29, 2026 07:00 IST
అమరావతి: నేడు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబరు 2 వరకు వర్షాలు పడే అవకాశం
రానున్న రెండు రోజుల్లో పిడుగులతో వర్షాలు
-
Aug 29, 2026 07:00 IST
అల్లూరి: నేడు అరకులోయలో సీఎం చంద్రబాబు పర్యటన
గన్నెలలో సంజీవని పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్న సీఎం
పథకం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
-
Aug 29, 2026 06:59 IST
విశాఖ: ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య
భార్య, ఇద్దరు కుమార్తెలు సహా మల్లా వినోద్ కుమార్ ఆత్మహత్య
పెందుర్తి మండలం చింతలగ్రహారం కాలనీలో ఘటన
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు