Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 07 , 2026 | 06:49 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 07, 2026 08:03 IST

    హైదరాబాద్: ఫేక్ ఫారం-7 పత్రాలపై కేసు నమోదు

    • చిక్కడపల్లి పీఎస్‌లో బీజేపీ BLA బాలచందర్‌పై కేసు

    • ERO ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

    • లీగల్ ఒపీనియన్ తర్వాత కేసు నమోదు

    • 30 మంది ఓట్లు తొలగించేందుకు బాలచందర్ కుట్ర పన్నినట్టు గుర్తింపు

  • Oct 07, 2026 07:58 IST

    ఢిల్లీ: రాహుల్‌గాంధీ ధర్నాపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన

    • నిన్న సా.4 వరకు ఏ పార్టీ కూడా మాతో భేటీకి సమయం కోరలేదు: ఈసీ

    • నిన్న సా.4గంటల తర్వాత రాహుల్‌ బృందం కలవాలని భావించింది: ఈసీ

    • 240 మంది ఎంపీలతో భేటీ నిర్వహించాలని ప్రతిపాదన వచ్చింది: ఈసీ

    • ప్రొటోకాల్ ప్రకారం ఎన్నికల సంఘం ప్రాంగణంలోనే భేటీ జరగాలి: ఈసీ

  • Oct 07, 2026 07:45 IST

    ఏలూరు: నేడు ఏలూరులో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పర్యటన

    • ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లు, ఇతర అంశాలపై పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష

  • Oct 07, 2026 07:44 IST

    తూర్పు గోదావరి జిల్లా పరిసరాల్లో మళ్లీ పెద్దపులి కదలికలు

    • తాళ్లపూడి మం. గజ్జరం, తుపాకుల గూడెం, గోపాలపురం మం. గోపవరం ప్రాంతాల్లో పెద్దపులి సంచారం

    • రేడియో ట్రాకింగ్ ద్వారా గుర్తించిన అధికారులు

    • పదినెలలుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి

  • Oct 07, 2026 07:43 IST

    భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి

    • నల్ల సముద్ర తీరానికి సమీపంలో ఘటన

    • 23 మంది భారతీయులను కాపాడామన్న రష్యా

    • నేవల్ డ్రోన్స్‌తో దాడి జరిగినట్టు ప్రకటన

  • Oct 07, 2026 07:42 IST

    హైదరాబాద్: బేగంబజార్ వాచ్ వ్యాపారి దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్

    • కత్తితో బెదిరించి వ్యాపారి నుండి 9.50 లక్షలు ఎత్తుకెళ్లిన జహీర్

    • బహదూర్‌పురాకు చెందిన జహీర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Oct 07, 2026 07:34 IST

    ఆదిలాబాద్: గుడిహత్నూర్ సమీపంలో కారు-లారీ ఢీ

    • ముగ్గురికి స్వల్ప గాయాలు

  • Oct 07, 2026 07:25 IST

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రౌండ్‌టేబుల్ భేటీ

    • కరవు పరిస్థితులపై కీలక సమావేశం

  • Oct 07, 2026 07:19 IST

    TGSRTC గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం నేటితో పూర్తి

    • ఈ నెల 9న పోలింగ్, 17న కౌంటింగ్

  • Oct 07, 2026 07:16 IST

    రాజమండ్రి: సీతానగరం మండలంలో పులి కలకలం

    • వంగలపూడి, రామచంద్రాపురంలో నిన్న రాత్రి పులి సంచారం

    • నివాస ప్రాంతాల దగ్గర సంచరించిన పులి

    • గోదావరి నది దాటి పట్టిసీమ వైపునకు వెళ్లినట్టు సమాచారం

  • Oct 07, 2026 07:10 IST

    తూ.గో. జిల్లా: కొవ్వూరు రైల్వే బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలోకి దూకి యువకుడి ఆత్మహత్నాయత్నం

    • కొవ్వూరుకు చెందిన కందాల కరుణ్ కుమార్(24)గా గుర్తింపు

    • గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు

  • Oct 07, 2026 07:06 IST

    ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంలో విచారణ

    • ఢిల్లీలో ముగ్గురు ఏపీ మంత్రులు

    • న్యాయ నిపుణులతో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి చర్చలు

  • Oct 07, 2026 07:05 IST

    నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీసీ కమిషన్ పర్యటన

    • వరుస గ్రామ బహిష్కరణలపై విచారణ చేపట్టనున్న కమిషన్

    • 20 గ్రామాల బాధితులతో ముఖాముఖి

    • గ్రామ అభివృద్ధి కమిటీలపై పోలీసులతో సమీక్ష

  • Oct 07, 2026 07:05 IST

    రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురి మృతి

    • గొల్లపల్లిలో బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

    • దంపతులు సహా కుమారుడి మృతి, చిన్నారికి గాయాలు

    • మృతులు కమ్మరి మధు, సావిత్రి, చిన్నారి ధనుష్‌గా గుర్తింపు

  • Oct 07, 2026 07:04 IST

    తిరుపతి: నవరాత్రి బ్రహ్మోత్సవాలతో TTD కీలక నిర్ణయం

    • బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు

    • ఉ.10:00 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

    • ఈ నెల 11 నుంచి 20 వరకు VIP బ్రేక్ దర్శనాల రద్దు

  • Oct 07, 2026 07:03 IST

    నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

    • ఇండియా కూటమి నిరసనల్లో పాల్గొననున్న రేవంత్‌

    • రాహుల్‌ అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు

  • Oct 07, 2026 07:00 IST

    నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు, కీలక సమావేశాలు

    • ఉదయం కేబినెట్‌ భేటీ తర్వాత ఢిల్లీకి చంద్రబాబు పయనం

    • అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశాలు

    • పోలవరం-నల్లమలసాగర్‌ లింకేజ్‌కు అనుమతులు, పోలవరం ప్రాజెక్ట్‌ రెండో దశకు నిధులు కోరే అవకాశం

  • Oct 07, 2026 06:59 IST

    హైదరాబాద్‌: శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పేరు పెద్దషాపూర్‌గా మార్పు

    • ఆర్జీఐఏ స్టేషన్‌కు శంషాబాద్‌గా పేరు మార్పు

  • Oct 07, 2026 06:59 IST

    నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ

    • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం

    • సంస్థలకు భూకేటాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం

    • డైట్‌ ఛార్జీల పెంపునకు ఆమోదం తెలపనున్న కేబినెట్‌

    • అమరావతిలో నిర్మాణాలకు పాలన అనుమతులు చేసే అవకాశం

  • Oct 07, 2026 06:58 IST

    విజయవాడ: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏడుగురు నిరుద్యోగులకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ టోకరా

    • రూ.43.11 లక్షలు వసూలు చేసిన సంస్థ నిర్వాహకులు

    • ఉద్యోగాలు రాకపోవడంతో మాచవరం పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు

  • Oct 07, 2026 06:56 IST

    హైదరాబాద్‌: రేపు జరగాల్సిన ఎథిక్స్‌ కమిటీ భేటీ వాయిదా

    • ఈనెల 13న సమావేశంకానున్న ఎథిక్స్‌ కమిటీ

    • ఎథిక్స్‌ కమిటీకి నేడు వివరణ ఇవ్వనున్న MLA కౌశిక్‌రెడ్డి

  • Oct 07, 2026 06:56 IST

    హైదరాబాద్: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

    • తిరుచ్చి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.2.25 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు స్వాధీనం

  • Oct 07, 2026 06:55 IST

    నా కల నిజమైంది: భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

    • వెస్టిండీస్‌పై తొలి టీ20లో భారత్ ఘన విజయం

    • అజేయ శతకంతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్(102*)

    • టీ20ల్లో శ్రేయస్​కు ఇదే తొలి సెంచరీ

    • మ్యాచ్ అనంతరం తన శతకం, జట్టు ప్రదర్శనపై అయ్యర్ హర్షం

  • Oct 07, 2026 06:52 IST

    ఢిల్లీ: GST కౌన్సిల్‌ మీటింగ్‌ రేపటికి వాయిదా

    • నేడు జరగాల్సిన GST మీటింగ్‌ అక్టోబర్‌ 8కి వాయిదా

  • Oct 07, 2026 06:52 IST

    మరోసారి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌

    • ఒక్కసారిగా 65 బిలియన్‌ డాలర్లు పెరిగి 1.03 ట్రిలియన్‌ డాలర్లకు చేరిన మస్క్‌ సంపద

  • Oct 07, 2026 06:49 IST

    ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు

    • చమోలీ జిల్లా నందాదేవి నేషనల్ పార్క్‌ సమీపంలో 5.1 తీవ్రతతో కంపించిన భూమి

    • ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణాలోనూ ప్రకంపనలు

    • అస్సాంలోనూ 4.5 తీవ్రతతో భూప్రకంపనలు