-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 19th September 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 19 , 2026 | 07:10 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 19, 2026 08:33 IST
హైదరాబాద్: నేడు గ్రేటర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి సమీక్ష
హాజరుకానున్న హౌసింగ్‌శాఖ అధికారులు, క్యూర్ పరిధి కమిషనర్లు, కలెక్టర్లు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మౌలిక సదుపాయాలపై చర్చ
-
Sep 19, 2026 08:17 IST
హైదరాబాద్: నేడు సా.5:00 గంటలకు MCRHRDకి సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
-
Sep 19, 2026 08:09 IST
హైదరాబాద్: నేడు జన్వాడ ఫామ్హౌస్కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఉ.10:30కు ప్రజాభవన్ నుంచి బయల్దేరనున్న నేతలు
జన్వాడలోని కేటీఆర్ ఫామ్‌హౌస్ భూముల పరిశీలన
నిన్న సిద్దపేటలో పర్యటించిన కాంగ్రెస్ నేతలు
-
Sep 19, 2026 08:03 IST
హైదరాబాద్: నేడు ఉ.11:00 గంటలకు శాసనసభలో ఎథిక్స్ కమిటీ భేటీ
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అంశంపై చర్చించనున్న ఎథిక్స్ కమిటీ
వివరణ ఇచ్చేందుకు 3 వారాల సమయం కోరిన కౌశిక్‌రెడ్డి
-
Sep 19, 2026 08:02 IST
ఏలూరు: దెందులూరు గరుడ హోటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం
బైక్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరి మృతి
-
Sep 19, 2026 07:52 IST
నాగర్‌కర్నూల్: కల్వకుర్తిలో గణేశ్ మండపంలో విద్యుత్ షాక్‌తో అరవింద్ అనే యువకుడి మృతి
మరో యువకుడికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Sep 19, 2026 07:51 IST
హైదరాబాద్: నేడు ఎల్బీనగర్‌లో మంత్రి పొంగులేటి పర్యటన
9 వేల కుటుంబాలకు భూ హక్కు పట్టాల పంపిణీ
-
Sep 19, 2026 07:48 IST
నేడు సూర్యాపేట జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన
కోదాడలో మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా
పాల్గొననున్న కోమటిరెడ్డి, అడ్లూరి, శ్రీధర్‌బాబు, గడ్డం ప్రసాద్, గుత్తా సుఖేందర్ రెడ్డి
-
Sep 19, 2026 07:40 IST
నేడు మూడో రోజు ఎర్రవల్లిలో రెవెన్యూ సర్వే
అసైన్డ్ భూముల బౌండరీలు గుర్తించనున్న అధికారులు
-
Sep 19, 2026 07:39 IST
తిరుమల: నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ
నాలుగు మాడ వీధుల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు
సాయంత్రం నుంచి తిరుమలకు టూవీలర్స్ నిలిపివేత
గ్యాలరీల్లో 1.80 లక్షల మంది భక్తులకు అనుమతి
ఔటర్ రింగ్‌రోడ్డులో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు
-
Sep 19, 2026 07:38 IST
ఢిల్లీ: నేడు 20వ రోజ్‌గార్ మేళా
51వేల మందికి నియామక పత్రాలు అందించనున్న మోదీ
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాల పంపిణీ
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు రోజ్‌గార్ మేళా
రైల్వే, రెవెన్యూ శాఖల్లో యువతకు ఉద్యోగాలు
-
Sep 19, 2026 07:36 IST
నేడు ఢిల్లీలో పర్యావరణంపై అంతర్జాతీయ సదస్సు
విజ్ఞాన్ భవన్‌లో సదస్సును ప్రారంభించనున్న మోదీ
రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహణ
హాజరుకానున్న 17 దేశాల న్యాయమూర్తులు
-
Sep 19, 2026 07:27 IST
అమరావతి: భోగాపురం సమీపంలో ఎన్డీఏ కూటమి కీలక భేటీ
స్థానిక ఎన్నికలపై కూటమి పార్టీల సుదీర్ఘ చర్చ
క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలపై కసరత్తు
టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయమే కీలకమన్న పల్లా
గెలుపే లక్ష్యంగా కూటమి కార్యాచరణకు నిర్ణయం
-
Sep 19, 2026 07:27 IST
నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
వేలాది పేద కుటుంబాల కల సాకారం అంటూ ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్
నేడు విశాఖలో 28,445 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ
ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నవారికి క్రమబద్ధీకరణ
11 మండలాల్లో 19,33,853 చ.గజాల స్థలాల క్రమబద్ధీకరణ
AU కాలేజీలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి
-
Sep 19, 2026 07:26 IST
రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై ట్రంప్ సంతకం
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై ఈ బిల్లు ద్వారా 100% పన్ను విధించే ఛాన్స్
చైనా, భారత్ సహా మరికొన్ని దేశాలపై ప్రభావం
రష్యా నుంచి నేచురల్ గ్యాస్‌ను 15% కంటే తక్కువ దిగుమతి చేసుకుంటున్న దేశాలకు మినహాయింపు
-
Sep 19, 2026 07:21 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
వైట్‌హౌస్‌లోకి CNN, MS NOW, Politico వార్తా సంస్థల ప్రవేశంపై నిషేధం
తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నందుకే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
ప్రతికూల వార్తలు రాసే మరికొన్ని వార్తా సంస్థలపైనా వేటు తప్పదని హెచ్చరిక
-
Sep 19, 2026 07:12 IST
WAPLలో తొలి సీజన్‌కు రంగం సిద్ధం
నేటి నుంచి మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్
4 జట్లు తలపడే టోర్నీలో 7 రోజుల పాటు 13 మ్యాచ్‌లు
మంగళగిరిలోని ఏసీఏ స్టేడియం వేదికగా మ.1:30కు రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య మ్యాచ్
-
Sep 19, 2026 07:11 IST
నేటి నుంచి ఆసియా క్రీడలు
శతక పతకాలపై భారత్ గురి
ఆసియా క్రీడలకు ఆతిథ్యమిస్తున్న జపాన్
-
Sep 19, 2026 07:10 IST
హైదరాబాద్: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
పాలమాకుల వద్ద ఇన్నోవా కారు బోల్తా.. కల్వర్టును ఢీకొట్టిన వాహనం
ప్రమాద ధాటికి నుజ్జునుజ్జయిన ఇన్నోవా.. స్పాట్‌లోనే నలుగురి దుర్మరణం
మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తింపు