నోరు తెరువలేని బాలుడికి అరుదైన చికిత్స
ABN , Publish Date - May 14 , 2026 | 08:48 AM
నోరు పూర్తిస్థాయిలో తెరువలేక, ఆహారం తినలేక, బిగ్గరగా నవ్వలేక ఇబ్బంది పడుతున్న ఐదేళ్ల బాలుడికి కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ చేసి ఆ పిల్లాడి ముఖంలో సంతోషం తెప్పించారు.
దవడ ఎముక ఎదుగుదల లోపంతో ఇబ్బంది
కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రిలో విజయవంతంగా సర్జరీ
హైదరాబాద్ సిటీ: నోరు పూర్తిస్థాయిలో తెరువలేక, ఆహారం తినలేక, బిగ్గరగా నవ్వలేక ఇబ్బంది పడుతున్న ఐదేళ్ల బాలుడికి కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ చేసి ఆ పిల్లాడి ముఖంలో సంతోషం తెప్పించారు. సిద్దిపేటకు చెందిన పి.కరుణాకర్ కుమారుడు పి. యశ్వంత్ పుట్టిన కొద్ది నెలల్లోనే నోరు తెరవలేకపోవడంతో ఇబ్బంది పడ్డాడు. ఇది సాధారణ సమస్య అని, కొన్ని నెలల్లో సర్దుకుంటుందని తల్లిదండ్రులు భావించారు.
వయస్సు పెరుగుతున్నా కొద్దీ సమస్య తీవ్రమవుతూ ఐదేళ్లు వచ్చే సరికి బాబు నోట్లో ఒక్క వేలు కూడా సరిగ్గా పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. తోడపుట్టిన చెల్లెలు పది నిమిషాల్లో తినే ఆహారం, యశ్వంత్ తినేందుకు మాత్రం గంటకుపైగా పట్టేది. నవ్వలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, స్లీప్ అప్నియాతో నిద్రపట్టకపోవడం వంటి సమస్యలతో అవస్థలు పడ్డాడు. దీంతో బాబును తల్లిదండ్రులు ఇటీవల కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి ప్లాస్టిక్ అండ్ రీ కన్‌స్ట్రక్టివ్ సర్జన్ నిశాంత్ సాధనాల దగ్గరికి తీసుకొచ్చారు.
బాబును పరీక్షించగా కుడివైపు దవడ ఎముక ఎదుగుదల ఆగిపోయిందని, టెంపోగోమ్యాండిబ్యులర్ జాయింట్(టీఎంఐ) యాంకిలోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. బాలుడికి ఐదు గంటలపాటు సర్జరీ చేసి 1 నుంచి 2 మిల్లీమీటర్లు మాత్రమే తెరుచుకునే నోటిని 34 మిల్లీమీటర్లు తెరుచుకునేలా, ఆగిపోయిన దవడ బోన్ పెరిగేలా చేశారు. భవిష్యత్తులో ముఖం ఆకారం కూడా మారదని వైద్యులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
రక్తపోటు నుంచి బరువు వరకు.. మందార టీతో ఎన్నో లాభాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News