లిఫ్ట్‌లో ఇరుక్కొని ఐదేళ్ల బాలిక మృతి
ABN , Publish Date - May 14 , 2026 | 04:40 AM
లిఫ్ట్‌లో చిక్కుకొని ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో గచ్చిబౌలి పరిధిలోని ఓ మహిళా హస్టల్‌లో చోటు చేసుకుంది.
రాయదుర్గం, మే 13 (ఆంధ్రజ్యోతి): లిఫ్ట్‌లో చిక్కుకొని ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో గచ్చిబౌలి పరిధిలోని ఓ మహిళా హస్టల్‌లో చోటు చేసుకుంది. మృతి చెందిన బాలిక పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తు ఘోష్(5)గా పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిట్టు ఘోష్ దంపతులు గౌలిదొడ్డిలోని మహీ ఉమెన్స్ పీజీ హస్టల్‌లో ఉంటూ వంటపని చేస్తున్నారు. వారి కుమార్తె బిస్తు ఘోష్ తెలియకుండా బుధవారం మధ్యాహ్నం లిఫ్ట్‌లో అపార్టుమెంట్ గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి ఐదో ఫ్లోర్‌కు వెళ్లింది. పైకి వెళుతున్న క్రమంలో మూడో ఫ్లోర్‌లో చిన్నారి దుస్తులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాయి. దీంతో తల భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.