Share News

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 14 , 2026 | 06:54 AM

కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Rates on May 14

ఇంటర్నెట్ డెస్క్: దిగుమతి సుంకాల పెంపు నేపథ్యంలో భారత్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రికార్డు స్థాయిలకు చేరాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ( మే 14) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,62,010గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,510గా ఉంది. కిలో వెండి రూ.3,20,100ల వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా దాదాపు ఇవే రేట్స్ ఉన్నాయి.


చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,680గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,50,010గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,62,010గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,48,510గా ఉంది. ఇక ఢిల్లీలో మేలిమి బంగారం ధర రూ.1,62,160గా, ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,48,660ల వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర చెన్నైలో రూ.3,20,100ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇతర నగరాల్లో రూ.3.10 లక్షలను దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల పసిడి ధర 4,690 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 87 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌!

హెచ్‌పీసీఎల్‌ లాభం రూ.4,901 కోట్లు

Updated Date - May 14 , 2026 | 07:57 AM