ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి భారీ డివిడెండ్!
ABN , Publish Date - May 14 , 2026 | 01:46 AM
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అత్యధిక డివిడెండ్‌ను చెల్లించే...
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అత్యధిక డివిడెండ్‌ను చెల్లించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్న వేళ ఎదురవుతున్న సవాళ్లను కేంద్రం ఎదుర్కొనే ందుకు ఇది దోహదపడనుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ను గత ఏడాది ఆర్‌బీఐ చెల్లించింది. అంతక్రితం సంవత్సరంలో బదిలీ చేసిన రూ.2.11 లక్షల కోట్ల కన్నా ఇది 27 శాతం అధికం. కాగా డివిడెండ్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఆర్‌బీఐ బోర్డు సమావేశం ఈ నెలలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ పత్రాల ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రిజర్వు బ్యాంకు, నేషనలైజ్డ్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల నుంచి రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్‌ను కేంద్రం అంచనా వేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్