హెచ్‌పీసీఎల్ లాభం రూ.4,901 కోట్లు
ABN , Publish Date - May 14 , 2026 | 01:43 AM
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన...
న్యూఢిల్లీ: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన నికర లాభం 46 శాతం పెరిగి రూ.4,901.50 కోట్లకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.3,354.98 కోట్లుగా ఉంది. మార్చిలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీని ఉత్పత్తి వ్యయంకన్నా తక్కువ ధరకు విక్రయించడం ద్వారా భారీ నష్టాలను చవిచూసినప్పటికీ రికార్డు స్థాయి త్రైమాసిక లాభాన్ని ప్రకటించడం విశేషం. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రికార్డు స్థాయిలో రూ.17,175.23 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ.7,271.32 కోట్లతో పోల్చితే ఇది రెండింతలకన్నా ఎక్కువ.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్