Share News

నిమ్స్‌కు పెరిగిన రోగుల తాకిడి.. రోజుకు 5 వేలకుపైగా ఓపీ

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:25 AM

పేదల కార్పొరేట్‌ ఆసుపత్రిగా ఖ్యాతిగాంచిన నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌స్‌(నిమ్స్‌)కు రోగుల తాకిడి పెరుగుతోంది.

నిమ్స్‌కు పెరిగిన రోగుల తాకిడి.. రోజుకు 5 వేలకుపైగా ఓపీ
NIMS Hospital

  • నిత్యం ఓపీ రిజిస్ట్రేషన్‌ ఐదు వేల పైమాటే.. అత్యవసర విభాగానికి పెరిగిన రద్దీ

హైదరాబాద్: పేదల కార్పొరేట్‌ ఆసుపత్రిగా ఖ్యాతిగాంచిన నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌స్‌(నిమ్స్‌)కు రోగుల తాకిడి పెరుగుతోంది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేక దూరమైనా రాష్ట్రం నలుమూలల నుంచి చికిత్స కోసం నిమ్స్‌కు వస్తున్నారు. గతంలో ఓపీకి దాదాపు 3,500 మంది వచ్చేవారు. అయితే ఆ సంఖ్య ఈ నెల 5న అమాంతం 5,635కు చేరుకుంది. సగటున నిమ్స్‌లో చికిత్సకు వచ్చేవారి సంఖ్య రోజుకు 5 వేలపై మాటే.


city7.jpgనగదు రహిత చికిత్సలతో..

తక్కువ ఖర్చు, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ వంటి పథకాలలో నగదు రహిత శస్త్రచికిత్సలు ప్రజలకు అందుబాటులో ఉండంతో అందరూ నిమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిభ గల వైద్యులు అందుబాటులో ఉండటంతో పాటు క్లిష్టమైన చికిత్సలను విజయవంతంగా నిర్వహించడంతో రోగులు నిమ్స్‌కు మొగ్గు చూపుతున్నారు. అత్యవసర విభాగంలోనూ గతంతో చూస్తే రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు 50 మంది రోగులు అత్యవసర విభాగానికి రాగా ప్రస్తుతం ఆ సంఖ్య 80కి చేరుకుంది. ఒక్కో రోజు 100 మంది వరకు వచ్చిన సందర్భాలున్నాయి.


ఓపీ రిజిస్ట్రేషన్‌ మధ్యాహ్నం వరకే

నిమ్స్‌లో వైద్య చికిత్స పొందడానికి ఉదయం 8 నుంచి 11 వరకు ఓపీ రిజిస్ట్రేషన్‌ ఉండేది. ఆ సమయాన్ని మరో మూడు గంటలకు పెంచారు. దూర ప్రాంతం నుంచి వచ్చే రోగులను దృష్టిలో ఉంచుకుని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్‌ సమయాన్ని పొడిగించారు. ఇక్కడ మొత్తం 28 విభాగాల్లో రోగులకు వైద్యచికిత్సలు అందుతున్నాయి. ఆయా విభాగాల్లో నిత్యం రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండంతో చికిత్సకు ఎగబడుతున్నారు. ఒక రోజులో వివిధ రకాల వైద్య పరీక్షలు చేసుకున్నవారి సంఖ్య 5,088గా తేలింది. అదేవిధంగా ఒక రోజులో 360 మంది రోగులు ఇన్‌పేషెంట్‌ విభాగంలో వైద్య చికిత్సకు చేరిన సందర్భాలున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

ఓటును హరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై 12న ఓవర్‌సైట్‌ కమిటీ భేటీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 10:33 AM