Share News

ప్రజలపై ట్రూ-అప్‌ చార్జీల భారం వేయొద్దు : సీపీఎం

ABN , Publish Date - Oct 08 , 2026 | 07:13 AM

విద్యుత్తు వినియోగదారులపై ట్రూ-అప్‌ చార్జీల పేరుతో రూ.7,635 కోట్ల మేర అదనపు భారాన్ని మోపాలని ప్రభుత్వం చూస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పేర్కొన్నారు.

ప్రజలపై ట్రూ-అప్‌ చార్జీల భారం వేయొద్దు :  సీపీఎం
John Wesley

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్తు వినియోగదారులపై ట్రూ-అప్‌ చార్జీల పేరుతో రూ.7,635 కోట్ల మేర అదనపు భారాన్ని మోపాలని ప్రభుత్వం చూస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పేర్కొన్నారు. ప్రభుత్వం, ఈఆర్సీ విధానాలను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని వెల్లడించారు.


2026 నవంబరు నెలలో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబరు నుంచి యూనిట్‌కు 50 పైసలు చొప్పున పెంచాలని డిస్కమ్‌లు నిర్ణయించడం సామాన్య ప్రజల నడ్డి విరవడమే అని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 07:13 AM