Share News

100 కోట్ల వోల్టుల పిడుగు.. అయినా విమానం సేఫ్.. సీక్రెట్ ఏంటంటే..

ABN , Publish Date - Oct 08 , 2026 | 09:08 AM

100 కోట్ల వోల్టుల పిడుగుపాటు నుంచి ఇండిగో విమానం సేఫ్‌గా బయటపడటం వెనుక ఇంజినీరింగ్ అద్భుతం ఉందని అంటున్నారు. ఇదేంటంటే..

100 కోట్ల వోల్టుల పిడుగు.. అయినా విమానం సేఫ్.. సీక్రెట్ ఏంటంటే..
Faraday Cage- Aircraft lightning protection

ఇంటర్నెట్ డెస్క్: ఓ ఇండిగో విమానం నిన్న పిడుగుపాటు నుంచి సేఫ్‌గా బయటపడిన విషయం తెలిసిందే. ప్రయాణికులు అందరూ సేఫ్‌గా ఉన్నారు. పిడుగుపాటు అంటే దాదాపు 100 కోట్ల వోల్టుల విద్యుదాఘాతం. ఇంతటి శక్తిని విమానం తట్టుకుని నిలబడటం వెనుక ఓ ఇంజినీరింగ్ అద్భుతం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇదేంటో వివరంగా తెలుసుకుందాం పదండి..

ఫారెడే కేజ్.. విమానానికి శ్రీరామ రక్ష

విమానం చుట్టూ పైపొరగా ఏర్పాటు చేసే రాగి జాలీని ఫ్యారెడే కేజ్ అని పిలుస్తారు. పిడుగుపాటు నుంచి రక్షణగా దీన్ని ఏర్పాటు చేస్తారు. పిడుగుపాటు సమయంలో కోట్ల వోల్టుల శక్తితో ఉన్న విద్యుత్‌ ప్రవాహం విమానం లోపలికి చొరబడకుండా ఈ జాలీ అడ్డుకుంటుంది. దారి మళ్లిస్తుంది. జాలీ మీదుగా ప్రవహించే విద్యుత్ చివరకు విమానం వెనుక భాగం డిశ్చార్జర్‌ల నుంచి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రూపంలో బయటకు విడుదల అవుతుంది. దీంతో, విమానం లోపల ప్రయాణికులు సురక్షితంగా ఉంటారు. విమానంలోని ఏవియానిక్స్, ఇతర అంతర్గత వైరింగ్‌కు కూడా ఫ్యారెడే కేజ్ రక్షణగా ఉంటుంది.


విమానం ముందు భాగానికి డ్యామేజ్.. కారణం ఇదే..

తాజా ఉదంతంలో విమానం ముందు భాగం మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ఈ భాగాన్ని రాడోమ్ అని పిలుస్తారు. రాడోమ్ చుట్టూ ఫ్యారెడే కేజ్ లేకపోవడం వల్లే పిడుగుపాటు సమయంలో అది దెబ్బతిన్నదని నిపుణులు చెబుతున్నారు. ఫ్యారెడే కేజ్‌ను అక్కడ ఏర్పాటు చేయకపోవడానికి పెద్దకారణమే ఉందని చెబుతున్నారు. రాడోమ్‌ భాగంలో విమానం రాడార్‌ను అమరుస్తారు.

ఈ రాడార్ సాయంతోనే వాతావరణ మార్పులను పైలట్లు తెలుసుకుంటారు. దీనికి రక్షణ ఫ్యారెడే కేజ్‌ను అమరిస్తే రాడార్ పనితీరు తగ్గిపోతుంది. వాతావరణ మార్పులను గుర్తించేందుకు అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి, ఈ కేజ్‌కు బదులు రాడోమ్‌కు రక్షణగా ఫైబర్ గ్లాస్‌ను ఏర్పాటు చేస్తారు. భారీ పిడుగుపాటుకు గురైనప్పుడు ఇది తట్టుకోలేక దెబ్బతినే అవకాశం ఉంది. ఇండిగోవిమానంలో కూడా ఇదే జరిగిందని నిపుణులు చెబుతున్నారు.


విమానయాన నిబంధన ప్రకారం, పిడుగుపాటుకు గురైన విమానాన్ని మొదట క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దెబ్బతిన్న రాడోమ్ స్థానంలో కొత్తదాన్ని అమరుస్తారు. లోపలి వైరింగ్ ఏమైనా దెబ్బతిన్నదా? అని తనిఖీలు చేస్తారు. పూర్తిస్థాయి తనిఖీలు, అనుమతుల తరువాత విమానాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు మళ్లీ వినియోగిస్తాయి. ఇండిగో విమానం ఉదంతంలో ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివియేషన్ ఈ అంశాలపై దృష్టి సారించింది.


ఈ వార్తలనూ చదవండి:

ఇంటర్వ్యూకు వెళ్తున్న కొడుకు.. అంతలో ఆ తండ్రి ఏం చేశాడంటే.. వీడియో వైరల్

రెండు తలలు.. నాలుగు కళ్లు.. గుజరాత్‌లో అరుదైన పాము వీడియో వైరల్..

Updated Date - Oct 08 , 2026 | 09:42 AM