Share News

రెండు తలలు.. నాలుగు కళ్లు.. గుజరాత్‌లో అరుదైన పాము వీడియో వైరల్..

ABN , Publish Date - Oct 07 , 2026 | 09:45 PM

గుజరాత్‌లో అత్యంత అరుదైన వింత పామును స్థానికులు గుర్తించారు. దహోద్ జిల్లాలోని ధన్‌పూర్ అటవీ ప్రాంతంలో రెండు తలల పాము కనిపించింది. ఈ పాముకు రెండు తలలు.. ఒక్కో తలకు రెండు చొప్పున నాలుగు కళ్లు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

రెండు తలలు.. నాలుగు కళ్లు.. గుజరాత్‌లో అరుదైన పాము వీడియో వైరల్..
two headed snake Gujarat

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లో అత్యంత అరుదైన వింత పామును స్థానికులు గుర్తించారు. దహోద్ జిల్లాలోని ధన్‌పూర్ అటవీ ప్రాంతంలో రెండు తలల పాము కనిపించింది. ఈ పాముకు రెండు తలలు.. ఒక్కో తలకు రెండు చొప్పున నాలుగు కళ్లు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అరుదైన పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది (Two headed snake Gujarat).


దహోద్ జిల్లాలోని ధన్‌పూర్ తాలూకా అగస్వాణి గ్రామంలోని ఓ పొలంలో ఈ పాము కనిపించింది. స్థానికులు దానిని చూసి వెంటనే దహోద్ ప్రకృతి మిత్ర మండల్ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని పరిశీలన కోసం దహోద్‌కు తీసుకెళ్లారు. సుమారు ఆరు అంగుళాల పొడవున్న ఈ పాము ఒకే శరీరంతో ఉన్నప్పటికీ రెండు తలలను కలిగి ఉంది. మొత్తం నాలుగు కళ్లు ఉన్నాయి (Wolf snake Dahod).


వన్యప్రాణి సంరక్షకుల ప్రకారం.. ఇది 'వుల్ఫ్ స్నేక్'. ఇది విషపూరితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ పాములో కనిపిస్తున్న రెండు తలల పరిస్థితిని శాస్త్రీయంగా ‘బైసెఫలీ’ (Bicephaly) అంటారు. భ్రూణ దశలో శరీరం సాధారణంగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఒకే శరీరానికి రెండు తలలు ఏర్పడే అరుదైన అభివృద్ధి లోపంగా దీనిని పరిగణిస్తారు. ప్రస్తుతం వన్యప్రాణి సంరక్షకులు దాని ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. దాని భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..


యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Oct 07 , 2026 | 09:50 PM