Share News

యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 07 , 2026 | 02:42 PM

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ లావాదేవీలపై కొత్తగా తీసుకురానున్న వ్యాపారి రుసుముల ప్రభావం గురించి భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..
UPI charges 2026

ఇంటర్నెట్ డెస్క్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (UPI) లావాదేవీలపై కొత్తగా తీసుకురానున్న వ్యాపారి రుసుముల ప్రభావం గురించి భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వల్ప రుసుము విధించినంత మాత్రాన యూపీఐ లావాదేవీల సంఖ్యపై పెద్దగా ప్రభావం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 15 నుంచి ఎంపిక చేసిన వ్యాపార చెల్లింపులపై వ్యాపారి తగ్గింపు రుసుము విధానం అమల్లోకి రానుంది (UPI charges 2026).


రూ.2,000కు మించి వ్యాపారికి చేసే యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం రుసుము వర్తిస్తుంది. అయితే ఒక్క లావాదేవీకి ఈ రుసుము గరిష్ఠంగా రూ.300కు పరిమితం అవుతుంది. ఈ రుసుమును వినియోగదారుల నుంచి వసూలు చేయరు. అర్హత కలిగిన వ్యాపారులే ఈ రుసుమును భరించాల్సి ఉంటుంది. రూ.2,000 వరకు ఉండే చెల్లింపులు, వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ బదిలీలు ఉచితంగానే కొనసాగుతాయి. చిన్న వ్యాపారులకు వర్తించే సున్నా రుసుము విధానంలోని లావాదేవీలకు కూడా మినహాయింపు ఉంటుంది (UPI merchant charges).


ప్రభుత్వం అంచనా ప్రకారం కొత్త రుసుము విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96 శాతం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగనున్నాయి (UPI fee October 15). కొత్త రుసుముల వల్ల యూపీఐ లావాదేవీల సంఖ్యలో ఎలాంటి తగ్గుదలా కనిపించదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. యూపీఐ వ్యవస్థను నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రత, సాంకేతిక వ్యవస్థలకు భారీగా ఖర్చు అవుతోంది. అందుకే వ్యాపారుల నుంచి స్వల్ప మొత్తంలో వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు.


ఇవి కూడా చదవండి:

ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ

తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి

Updated Date - Oct 07 , 2026 | 02:42 PM