రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ ట్రిక్.. పోలీసుల ప్లాన్‌ను ఎలా మార్చారు..
ABN , Publish Date - Oct 07 , 2026 | 03:33 PM
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన మార్చ్‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతే నిరసన అక్కడితో ముగిసిపోతుందని భావించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన మార్చ్‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిపక్ష ఎంపీలను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతే నిరసన అక్కడితో ముగిసిపోతుందని భావించారు. అయితే ఆ సమయంలో రాహుల్ గాంధీ అనూహ్యంగా వ్యవహరించారు. దీంతో సాధారణ మార్చ్ కాస్తా గంటల తరబడి సాగిన ధర్నాగా మారింది (Rahul Gandhi protest).
మొదట రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ ప్రారంభించారు. పోలీసులు మార్గమధ్యంలో భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకుని బస్సులోకి ఎక్కించారు. ప్రియాంక కూడా బస్సు ఎక్కి కూర్చున్నారు. అయితే రాహుల్ గాంధీ అక్కడితో నిరసనను ఆపెయ్యాలని అనుకోలేదు. బారికేడ్ ఎక్కి, ఎన్నికల సంఘం కార్యాలయానికి సమీపంలోని ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి వెళ్లారు. రాహుల్ సూచన మేరకు ప్రియాంక కూడా అక్కడికి వచ్చారు. ఆ తర్వాత మిగిలిన ఎంపీలు కూడా అక్కడకు చేరుకున్నారు (Rahul Gandhi Election Commission).
ఆ ప్రదేశం ఎన్నికల సంఘం కార్యాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఉంది (Election Commission protest). ప్రతిపక్ష ఎంపీలు అక్కడే నిరసన కొనసాగించారు. రాహుల్ అనూహ్య నిర్ణయంతో ఒక సాధారణ మార్చ్ కాస్తా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలపాటు కొనసాగిన స్టాండ్‌ఆఫ్‌గా మారింది. దాదాపు తొమ్మిది గంటల తర్వాత పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను అక్కడి నుంచి తొలగించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి:
ఇకపై సెలక్షన్ కమిటీ భేటీలకు వీవీఎస్ లక్ష్మణ్: బీసీసీఐ
తీవ్ర విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు విద్యార్థుల మృతి