Share News

ఓటు...పలు రకాలు

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:36 PM

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనది. ఓటు ద్వారా నేరుగా ప్రభుత్వాలను ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది.

ఓటు...పలు రకాలు
Elections

సత్యవేడు(తిరుపతి): ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనది. ఓటు ద్వారా నేరుగా ప్రభుత్వాలను ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక, పార్లమెంట్‌, మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో వినియోగించే ఓట్లు పలు రకాలుగా ఉంటాయి. అవి...

సాధారణ ఓటు: 18 నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఎన్నికల్లో పాల్గొనేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఫారం 6 ద్వారా 18 ఏళ్లు నిండి, స్థానికంగా నివాసం ఉన్నట్లు ఆధారాలు చూపిస్తే ఓటు హక్కు కల్పిస్తారు. దీనినే సాధారణ ఓటు అంటారు.


పోస్టల్‌ బ్యాలెట్‌: ఎన్నికల విధులలో ఉండి, తమ స్వగ్రామం, పట్టణంలో నేరుగా ఓటు వేయలేని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఓట్లనే పోస్టల్‌ బ్యాలెట్‌ అంటారు. సాధారణ ఓటర్ల కంటే ముందుగానే వీరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. వీరు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు అధికారిక ధ్రువీకరణ పత్రం (ఫాం- 14) అధికారులకు సమర్పించాలి.


సర్వీస్‌ ఓటు: దేశ రక్షణ సంబంధ శాఖలకు సంబంధించిన విధుల్లో ఉన్న అధికారులు, సైనికులు, సిబ్బందికి కల్పించిన ఓటు సర్వీస్‌ ఓటు. తపాలా శాఖ ద్వారా లేదా తమ ప్రతినిధి ద్వారా ఈ ఓటును పంపవచ్చు. పారామిలిటరీ ఉద్యోగులుగా గుర్తింపు, ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల అధికారులకు తప్పనిసరిగా అందిచాల్సి ఉంటుంది.


yyy.jpgటెండర్‌ ఓటు: పోలింగ్‌ కేంద్రానికి ఓటరు వెళ్లే సరికే అతని ఓటును అప్పటికే ఎవరో (దొంగ ఓటు) వేసేసి ఉంటే, అసలు ఓటరు తన గుర్తింపును నిరూపించుకుని, ప్రత్యేక బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఓటు వేయవచ్చు. కానీ ఆ ఓటును బ్యాలెట్‌ బాక్సులో వేయరు. సాధారణ కౌంటింగ్‌లో కూడా లెక్కించరు. గెలుపోటముల తేడా చాలా తక్కువగా ఉన్నప్పుడు కోర్టు ఆదేశాల మేరకు లెక్కిస్తారు.


చాలెంజ్‌ ఓటు: పోలింగ్‌ కేంద్రంలో ఓటరుపై అక్కడ ఉన్న ఏజెంట్‌కు అనుమానం కలిగి, అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఓటరు చాలెంజ్‌ చేయవచ్చు. అప్పుడు నిర్ణీత ఫీజును చెల్లిస్తే సంబంధిత ఎన్నికల అధికారి విచారణ జరిపి, ఓటరు నిజమైన వారేనని నిర్థారించి వేయించే ఓటునే చాలెంజ్‌ ఓటు అంటారు


ఈ వార్తలు కూడా చదవండి:

ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎస్‌ఈసీ అనుమతి.. కొత్త లబ్ధిదారులకు నో

ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. డ్రైవర్, ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 01:36 PM