Share News

బ్యాలెట్‌ పేపర్లు రెడీ..

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:53 PM

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. పోలింగ్‌ సామగ్రి సిద్ధం చేసే ప్రక్రియ తుది దశకు చేరడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

బ్యాలెట్‌ పేపర్లు రెడీ..
Elections

  • మేయర్‌ అభ్యర్థులకు 2.90 లక్షలు, కార్పొరేటర్లకు 5.80 లక్షలు

తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. పోలింగ్‌ సామగ్రి సిద్ధం చేసే ప్రక్రియ తుది దశకు చేరడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ పూర్తయింది. మేయర్‌ అభ్యర్థులకు 2,90,492 బ్యాలెట్‌ పత్రాలు, కార్పొరేటర్లకు సంబంధించి 5.80 లక్షల బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు.


zzz.jpgపోలింగ్‌ సమయంలో కొరత తలెత్తకుండా మొత్తం అవసరానికి అదనంగా 10 శాతం బ్యాలెట్‌ పత్రాలు రిజర్వులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేశారు. మేయర్‌ అభ్యర్థులకు పింక్‌ రంగు, కార్పొరేటర్ల అభ్యర్థులకు తెలుపు రంగులో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు. వాటిని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలోని స్ర్టాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచారు. అలాగే బ్యాలెట్‌ బాక్సుల తరలింపునకు సంబంధించి అవసరమైన వాహనాలను, సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏపీలో పింఛన్ల పంపిణీకి ఎస్‌ఈసీ అనుమతి.. కొత్త లబ్ధిదారులకు నో

ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. డ్రైవర్, ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 12:55 PM