రంగారెడ్డి జిల్లాలో విషాదం.. 23వ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:32 PM
రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అపార్ట్‌మెంట్ 23వ అంతస్తు నుంచి దూకి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి, అక్టోబర్ 30: జిల్లాలోని కోకాపేటలో ఓ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు కుమార్తె.. మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్టోబర్ 29న కుమార్తెను తల్లి మందలించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన బాలిక అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌లోని 23వ అంతస్తు నుంచి కిందకు దూకినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో బాలిక మృతి చెందింది. చిన్న వయసులోనే కుమార్తెను కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
అసలు కారణాలపై పోలీసుల దర్యాప్తు ..
కుమార్తె మృతిపై తండ్రి వెంకటేశ్వర్లు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లి మందలించడంతోనే విద్యార్థిని ఈ నిర్ణయం తీసుకుందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులతో ఆమెకున్న సంబంధాలు.. ఇతర కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థిని మృతికి దారితీసిన అసలు పరిస్థితులను గుర్తించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!
మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు
For More AP News And Telugu News