Share News

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల..

ABN , Publish Date - May 17 , 2026 | 11:34 AM

విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. నేడు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల..
TG EAPCET 2026

హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తెలంగాణ ఎప్‌సెట్‌ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మసీ) ఫలితాలను (TG EAPCET 2026) రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. నేడు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.


ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన టాప్ విద్యార్థుల జాబితాను ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రానా విడుదల చేశారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన టాప్ 10 ర్యాంకర్ల జాబితాను టెక్నికల్ కమిషనర్ దేవసేన ప్రకటించారు.


ర్యాంకులు సాధించిన విద్యార్థులు వీరే..

అగ్రికల్చర్ & ఫార్మసీ (A&P) స్ట్రీమ్

  • ర్యాంక్ 1: ముక్కరం అహ్మద్ – హుమాయున్ నగర్, ఆసిఫ్ నగర్

  • ర్యాంక్ 2: తౌద్రి నివృత్త్ సాయి వెంకట్ - ఎర్రమంజిల్, హైదరాబాద్

  • ర్యాంక్ 3: సాహితి గీతిక గుంతి – ఆల్మాస్‌గూడ, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ

  • ర్యాంక్ 4: జయసింహ – ఆర్కేనగర్, బాగ్ అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ

  • ర్యాంక్ 5: అమైర్ అనాస్ – రాయల్ కాలనీ, హుమాయున్ నగర్, హైదరాబాద్, తెలంగాణ

  • ర్యాంక్ 6: నాథన్ షేబా జెరూషా హిందూపూర్, శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రదేశ్

  • ర్యాంక్ 7: పెరికేటి అనురాగ్ – రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్

  • ర్యాంక్ 8: బూరసాయి చరణ్ – చిల్కూర్, సూర్యాపేట, తెలంగాణ

  • ర్యాంక్ 9: మిర్థిపాటి మారుతి సత్యశ్రీకర్ – రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్

  • ర్యాంక్ 10: రుటుంబికా మొహంతి – కూకట్‌పల్లి, మేడ్చల్, తెలంగాణ


ఇంజినీరింగ్ (E) స్ట్రీమ్

  • ర్యాంక్ 1: ఎం రుషి – ఉప్పల్, మేడ్చల్, తెలంగాణ

  • ర్యాంక్ 2: బెజుగామ అన్షుల్ - మూసాపేట్, హైదరాబాద్, తెలంగాణ

  • ర్యాంక్ 3: మారక వంశీధర్ రెడ్డి - పులివెందుల, కడప, ఆంధ్రప్రదేశ్

  • ర్యాంక్ 4: జొన్నల రోషన్ మనిదీప్ రెడ్డి - తాడేపల్లి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్

  • ర్యాంక్ 5: అడుల సాయి నికిత్ - మహబూబ్‌నగర్, తెలంగాణ

  • ర్యాంక్ 6: మల్లవరపు అస్మా - మల్లంపేట్, మేడ్చల్, తెలంగాణ

  • ర్యాంక్ 7: వివాన్ శరద్ మహేశ్వరి - బంజారాహిల్స్, హైదరాబాద్, తెలంగాణ

  • ర్యాంక్ 8: తెల్లూరి శ్రేయస్ రెడ్డి – కొండాపూర్, హైదరాబాద్, తెలంగాణ

  • ర్యాంక్ 9: బొమ్మిరెడ్డి సమీరాజ్ రెడ్డి – ఎల్‌బీ‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ

  • ర్యాంక్ 10: రాపోలు జయంత్ శేఖర్ - జీడిమెట్ల, మేడ్చల్, తెలంగాణ


తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ప్రముఖ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ప్రక్రియపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. కష్టపడి చదివిన విద్యార్థులకు ఇది మంచి ఫలితమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఈ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదలతో సోషల్ మీడియాలో కూడా విద్యార్థులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాప్ ర్యాంకర్లు సాధించిన విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి పొంగులేటి ప్రకటన

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 12:11 PM