ఉన్నత విద్యకు ప్రోత్సాహం..
ABN , Publish Date - May 15 , 2026 | 12:24 PM
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించేందుకు దేశంలోని అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన ఆయిల్ అండ్ నేచరుల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) ప్రతి ఏటా స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.
పేద విద్యార్థుల కోసం ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌లు
నెలకు రూ. 4 వేల చొప్పున ఏడాదికి రూ. 48 వేల ఉపకార వేతనం
కోర్సు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం
ఈ నెల 15 వరకు దరఖాస్తులకు అవకాశం
చొప్పదండి(కరీంనగర్): ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించేందుకు దేశంలోని అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన ఆయిల్ అండ్ నేచరుల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) ప్రతి ఏటా స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది. 2025-26 విద్యాసంత్సరంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎమ్మెస్సీ లాంటి డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో చేరిన వారు అర్హులు కాగా కోర్సు పూర్తయ్యేంతవరకు నెలకు 4 వేల రూపాయల చొప్పున ఏడాదికి 48 వేల రూపాయల స్కాలర్‌షిప్‌ను విద్యార్థులకు ఓఎన్‌జీసీ అందజేస్తుంది.
దేశవ్యాప్తంగా అర్హులైన 2 వేల మందిని ఎం పిక చేస్తుండగా, అందులో ఎస్సీ, ఎస్టీ వెయ్యి మంది, ఓబీసీ 500, ఈడబ్ల్యుఎస్ 500 మంది విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్‌షిప్‌లను అందజేస్తారు. ప్రతి కేటగిరీలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించగా, దేశాన్ని 5 జోన్లుగా విభజించగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలను జోన్-5గా ఎంపిక చేశారు.
అర్హతలు... కోర్సులు...
2025-26 విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరంలో చేరిన విద్యా ర్థులు మాత్రమే అర్హులు కాగా, ఫుల్‌టైం రెగ్యులర్ కోర్సులు చదువు తున్న విద్యార్థులు అర్హులు. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, ఎమ్మెస్సీ జువాలజీ, ఫిజిక్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఇంజనీ రింగ్, మెడిసిన్ విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు, ఎంబీఏ, ఎమ్మెస్సీ విద్యార్థులు డిగ్రీలో 60 శాతం మార్కులు ఉన్న వారు అర్హులు. ఈడబ్ల్యుఎస్, జనరల్ విద్యార్థుల ఆదాయ పరిమితి రెం డు లక్షలలోపు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 4.5 లక్షలలోపు ఉండాలి. ఆగస్టు 1, 2025 నుంచి విద్యార్థుల వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తులు ఇలా...
విద్యార్థులు ఎన్‌ఎస్‌పీ పోర్టల్ (నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్)లో నమోదు చేసుకోవాలి. అవసర మైన వయస్సు ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, మార్కుల మెమోలు, ఆదాయ ధ్రువీకరణ, బ్యాంకు వివరాలు, కళాశాల ఐడీ కార్డును అప్లోడ్ చేయాలి. ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. ongcscholar.org వెబ్‌సైట్‌లో వివరాలను తెలుసుకోవచ్చు.
కోర్సుల వారీగా స్కాలర్‌షిప్‌లు
ఇంజనీరింగ్ మొత్తం 1100, ఎస్సీ, ఎస్టీ 500, ఓబీసీ 300, జనరల్ 300, ఎంబీబీఎస్ 140, ఎస్సీ, ఎస్టీ 90, ఓబీసీ 50, జనరల్ 50, ఎంబీఏ 240, ఎస్సీ, ఎస్టీ 140, ఓబీసీ 50, జనరల్ 50, జువాలజీ/ ఫిజిక్స్ 470, ఎస్సీ, ఎస్టీ 270, ఓబీసీ 100, జనరల్ 100, ఇంజ నీరింగ్, ఎంబీబీఎస్ విద్యార్థులకు నాలుగు సంవత్సరాలపాటు, ఎంబీఏ, ఎమ్మెస్సీ విద్యార్థులకు రెండు సంవత్సరాలపాటు నెలకు 4 వేల చొప్పున అంద జేస్తారు. ఇంజనీరింగ్, మెడిసిన్ ఇంటర్ మార్కుల ఆధారంగా, ఎంబీఏ, ఎమ్మెస్సీ విద్యార్థులను డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. ఎంపి కైన విద్యార్థులు ప్రతి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News