Share News

శుభ కార్యాలకు విరామం!

ABN , Publish Date - May 15 , 2026 | 11:35 AM

గురువారం నుంచి బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు మూగబోయాయి. కల్యాణ మండపాలు బోసిపోయాయి.

శుభ కార్యాలకు విరామం!
Wedding muhurthams

  • నెల రోజుల పైబడి ముహూర్తాలకు బ్రేక్‌

  • అధిక జ్యేష్ట మాసం రాక

కలికిరి(తిరుపతి): గురువారం నుంచి బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు మూగబోయాయి. కల్యాణ మండపాలు బోసిపోయాయి. పురోహితులు పంచాంగాలు చుట్టేశారు. షామియానాలు, అలంకరణ సామగ్రిని యజమానులు అటకెక్కించేశారు. వంటవాళ్ళు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఫిబ్రవరి నుంచి మే 13 వరకూ తెలుగు లోగిళ్ళను వివిధ రకాల శుభకార్యాలతో కళకళలాడించిన ముహూర్తాలు నెల రోజల పైబడి సెలవు తీసుకుంటున్నాయి. గురువారం నుంచి మూడు రోజులు ముహూర్తాలు లేక ఎలాంటి శుభకార్యాలకు అవకాశం లేకుండా పోయింది.


ఆదివారం నుంచి అధిక జ్యేష్ట మాసం రానుండడంతో జూన్‌ 20 వరకూ మంచి రోజులు లేవని పురోహితులు చెపుతున్నారు.జూన్‌లో చివరి 8 రోజులు మంచి ముహూర్తాలున్నాయని పండితులు వివరిస్తున్నారు. జూలైలో మరో నాలుగు రోజులు మాత్రమే ముహూర్తాలున్నాయిని ఆ తరువాత చతుర్మాసం తదితర కారణాలతో ఆగస్టులో 11 రోజులు, సెప్టెంబరులో 4, అక్టోబరులో మరో 4 రోజులు మాత్రం ముహూర్తాలున్నా చతుర్మాసం అడ్డొస్తోందని పురోహితులు అంటున్నారు. ఆ తరువాత నవంబరులో కార్తీక మాసం కారణంగా 11 రోజులు, డిసెంబరులో మరో 14 రోజుల్లో కూడా అనువైన ముహూర్తాలున్నాయంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్, సిల్వర్ రేట్స్.. భారీగా ధరల పతనం

ప్రాంగణ నియామకాలకూ ఎగనామం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 15 , 2026 | 11:35 AM