గోల్డ్, సిల్వర్ రేట్స్.. భారీగా ధరల పతనం
ABN , Publish Date - May 15 , 2026 | 10:28 AM
దేశంలో బంగారం, వెండి ధరల్లో భారీగా కోత పడింది. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరల ర్యాలీకి బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. అంతర్జాతీయ అనిశ్చితులు, కేంద్రం దిగుమతి సుంకాల పెంపు నేపథ్యంలో నేడు బంగారం, వెండి ధరల్లో భారీ కోత కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మే 15) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,60,090కు పడిపోయింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే ధరలో ఏకంగా రూ.2,240ల మేర కోత పడింది. 22 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.1,46,750కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే ధర రూ.2,050ల మేర తగ్గింది. నగరంలో వెండి ధరలో కూడా రూ.10 వేల కోత పడింది. ప్రస్తుతం కిలో వెండి రూ.3.05 లక్షల వద్ద ట్రేడవుతోంది (Gold, Silver Rates Crash on May 15).
ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,63,390గా ఉంది. ఢిల్లీలో రూ.1,60,240గా, ముంబైలో రూ.1,60,090 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,49,500గా, ఢిల్లీలో రూ.1,46,900గా, ముంబైలో రూ.1,46,750గా ఉంది. చెన్నై సహా పలు నగరాల్లో వెండి దర రూ.3.05 లక్షల వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే దేశంలో కిలో వెండి ధర రూ.10 వేల మేర తగ్గింది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
ఒరాకిల్‌లో ప్రాంగణ నియామకాలకూ బ్రేక్
వారసత్వ ప్రణాళికను ప్రకటించిన ఎయిర్‌టెల్ అధిపతి