ప్రాంగణ నియామకాలకూ ఎగనామం!
ABN , Publish Date - May 15 , 2026 | 05:40 AM
గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించిన అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్.. తాజాగా మరో షాకిచ్చింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్...
ఎన్‌ఐటీ, ఐఐటీ విద్యార్థులకు జారీ చేసిన
జాబ్ ఆఫర్ లెటర్లను రద్దు చేసిన ఒరాకిల్
జాబితాలో ఎన్‌ఐటీ వరంగల్, ఐఐటీ హైదరాబాద్ సైతం..
ఇప్పటికే 30,000 మంది ఉద్యోగులను తొలగించిన సంస్థ
న్యూఢిల్లీ: గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించిన అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్.. తాజాగా మరో షాకిచ్చింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) వంటి పలు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ (ప్రాంగణ నియామకాలు) ప్రక్రియ ద్వారా విద్యార్థులకు జారీ చేసిన జాబ్ ఆఫర్ లెటర్లను, ప్రీ-ప్లే్‌సమెంట్ ఆఫర్ల (పీపీఓ)ను కంపెనీ రద్దు చేసింది. ఒరాకిల్ తాజా నిర్ణయంతో ప్రభావితమైన కాలేజీల్లో ఎన్‌ఐటీ వరంగల్, వీఎన్‌ఐటీ నాగ్‌పూర్, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ బీహెచ్‌యూ కూడా ఉన్నాయి.
చావు కబురు చల్లగా..: ఆఫర్ లెటర్ల రద్దు విషయాన్ని కంపెనీ ఈ వారంలోనే విద్యార్థులకు వెల్లడించింది. దాంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎందుకంటే, చాలావరకు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రాంగణ నియామకాల విషయంలో ‘‘ఒక విద్యార్థి- ఒక ఉద్యోగం’’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అంటే, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఒక కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ అందుకున్న విద్యార్థికి ఇతర కంపెనీల ఆఫర్లను దక్కించుకునే అవకాశం ఉండదు. దాంతో ఒరాకిల్ ఆఫర్ కోల్పోయిన వారిప్పుడు కొత్త ఉద్యోగం కోసం అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘సిస్కో’లో 4,000 ఉద్యోగాల కోత
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన సిస్కో కూడా భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా సిబ్బంది సంఖ్యను దాదాపు 4,000 మేర తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభావిత సిబ్బందికి నేరుగా తెలియజేయడం జరుగుతుందని కంపెనీ పేర్కొంది. సిస్కో కూడా తన పెట్టుబడులను కృత్రిమ మేధ (ఏఐ)తో పాటు వేగంగా వృద్ధి చెందుతున్న ఇతర విభాగాల వైపు పెట్టుబడులను మళ్లించే ప్రయత్నాల్లో ఉంది.
లింక్డ్‌ఇన్‌లో 5 శాతం జాబ్స్ కట్
మైక్రోసాఫ్ట్‌పరమైన వృత్తి నిపుణుల సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ సైతం ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. వృద్ధి చెందుతున్న విభాగాలపై దృష్టిపెట్టేందుకు సిబ్బంది పునర్‌వ్యవస్థీకరించాలనుకుంటున్న కంపె నీ.. అందులో భాగంగా 5 శాతం ఉద్యోగాలకు కోత పెట్టాలనుకుంటోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లింక్డ్‌ఇన్‌లో ప్రపంచవ్యాప్తంగా 17,500 ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Read Latest Telangana News And AP News And International News