పదేళ్లలో వారసులకు పగ్గాలు
ABN , Publish Date - May 15 , 2026 | 05:35 AM
ప్రైవేట్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వారసత్వ ప్రణాళికను ప్రకటించారు. వచ్చే పదేళ్లలో భారతీ ఎయిర్‌టెల్ పగ్గాలను తన పిల్లలకు...
వారసత్వ ప్రణాళికను ప్రకటించిన ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వారసత్వ ప్రణాళికను ప్రకటించారు. వచ్చే పదేళ్లలో భారతీ ఎయిర్‌టెల్ పగ్గాలను తన పిల్లలకు అప్పగించాలనుకుంటున్నట్లు మిట్టల్ తెలిపారు. అంతేకాదు, వచ్చే 3-4 ఏళ్లలో ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్ కంపెనీ భారతీ టెలికాం వాటాను తిరిగి 50 శాతానికి పైగా పెంచుకునే యోచన ఉందన్నారు. ఈ మార్చి చివరినాటికి ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికాం 40.47 శాతం వాటా కలిగి ఉంది. ఇతర ప్రమోటర్ సంస్థల్లో మిట్టల్ కుటుంబ హోల్డింగ్ కంపెనీ ఇండియన్ కాంటినెంట్ ఇన్వె్‌స్టమెంట్ 0.92 శాతం, సింగ్‌టెల్ గ్రూప్ సంస్థ పాస్టెల్ లిమిటెడ్ 7.49 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు మొత్తం 48.87 శాతం వాటా కలిగి ఉన్నాయి. మిగతా 51.09 శాతం వాటా పబ్లిక్ చేతుల్లో ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Read Latest Telangana News And AP News And International News