తిరుమల కొండపై జోరుగా కడియాల వ్యాపారం
ABN , Publish Date - May 15 , 2026 | 11:08 AM
తిరుమల కొండపై రోజుకో కడియాల తయారీ దుకాణం పుట్టుకొస్తోంది. సాధారణంగా తిరుమలలో గాజులు, టోపీలు, ఇత్తడి పూజా సామగ్రి, ఆటవస్తువులు, విగ్రహాలు, ఇతర రెడీమేడ్ వస్తువులను మాత్రమే విక్రయించాలి.
కొండపై భక్తుల మధ్య ఆయుధాలతో... నిబంధనలకు విరుద్ధంగా..
తిరుమల: తిరుమల కొండపై రోజుకో కడియాల తయారీ దుకాణం పుట్టుకొస్తోంది. సాధారణంగా తిరుమలలో గాజులు, టోపీలు, ఇత్తడి పూజా సామగ్రి, ఆటవస్తువులు, విగ్రహాలు, ఇతర రెడీమేడ్ వస్తువులను మాత్రమే విక్రయించాలి. వస్తువులను తయారు చేసి అమ్మకూడదనే నిబంధన ఉంది. ప్రత్యేకించి నిత్యం భక్తుల రద్దీ అధికంగా ఉండే తిరుమలలో కత్తి, కొడవలి, సుత్తి, రంపం, కట్టర్లు వంటి వాటిని వినియోగించకూడదనే నిబంధనలు అమల్లో ఉన్నాయి.
అయితే ఇటీవల తిరుమలలో కడియాలు అప్పటికప్పుడే తయారు చేసే వ్యాపారాలు అధికమయ్యాయి. భక్తుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సుత్తి, కట్టర్లు, రంపం వంటి వస్తువులతో పేర్లు చెక్కుతూ కడియాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి వ్యాపారాలు చేయడం ఒక అంశమైతే అనుకోకుండా భక్తుల మధ్య చిన్నపాటి ఘర్షణలు తలెత్తితే ఇవి ఆయుధాలుగా కూడా మారే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విజిలెన్స్ అధికారుల దృష్టి కడియాల దుకాణాలపై పడిందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్.. భారీగా ధరల పతనం
Read Latest AP News And Telangana News And International News And Telugu News