రైలు బాత్‌రూమ్‌లో షాకింగ్ సీన్.. వీడియో వైరల్
ABN , Publish Date - May 15 , 2026 | 10:07 AM
రైలు బాత్‌రూమ్‌లోని కమ్మోడ్ నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి సోషల్ మీడియా జమానాలో జనాలు తమకు తెలిసిన ఆసక్తికర విషయాలు నెట్టింట షేర్ చేస్తున్నారు. సామాజిక స్పృహ కలిగిన కొందరు తమ దృష్టికి వచ్చిన సమస్యలను కూడా నెట్టింట పంచుకుని జనాల్లో అవగాహన పెంచుతుంటారు. భారతీయ రైల్వేకు సంబంధించి ఇలాంటి అంశాలు నెట్టింట ట్రెండింగ్‌లో ఉంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియోకు ప్రస్తుతం భారీగా వ్యూస్ వస్తున్నాయి.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రైల్లోని ఒక బాత్‌రూమ్‌లోని కమ్మోడ్ నుంచి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసి షాకైపోయిన వ్యక్తి వెంటనే తన కెమెరాతో రికార్డు చేశారు. ఇది నెట్టింట వైరల్ అయ్యి పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే, ఈ ఘటన ఏ రైల్లో జరిగిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
వీడియోను చూసిన యూజర్లు రకరకాల కామెంట్స్ చేశారు. కమ్మోడ్‌లోంచి మంటలు రావడం తాము ఇంతవరకూ ఎన్నడూ చూడలేదని అన్నారు. కమ్మోడ్‌కు సమీపంలో రైలు బ్రేకులు ఉండి ఉంటాయని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. వీడియోకు ఇప్పటివరకూ 1.88 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఈ వార్తలనూ చదవండి:
ప్లాట్‌ఫామ్ కింద పడ్డ విదేశీ యువతి స్కార్ఫ్.. పట్టాలపైకి దూకిన వ్యక్తి.. చివరికి..
గంగా నదిలో ఆడుకుంటున్న చిన్నారులకు చిక్కిన డాల్ఫిన్..