Share News

గంగా నదిలో ఆడుకుంటున్న చిన్నారులకు చిక్కిన డాల్ఫిన్..

ABN , Publish Date - May 14 , 2026 | 06:02 PM

బిహార్ రాష్ట్రం ఛప్రా ప్రాంతానికి చెందిన కొంతమంది చిన్నారులు స్థానికంగా ఉన్న గంగా నదికి ఈత కొట్టేందుకు వెళ్లారు. సరదాగా నీటిలో ఆడుకుంటూ ఉండగా వారికి ఓ డాల్ఫిన్ కనిపించింది. అది ప్రమాదవశాత్తూ నది ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దానిని చుట్టుముట్టిన చిన్నారులు బయటకు తీసుకువచ్చారు.

గంగా నదిలో ఆడుకుంటున్న చిన్నారులకు చిక్కిన డాల్ఫిన్..
Dolphin Viral Video

బిహార్: డాల్ఫిన్‌తో కొంతమంది చిన్నారులు ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. డాల్ఫిన్‌ను చేతుల్లోకి తీసుకున్న చిన్నారులు దానితో ఆడుకున్నారు. జీవితంలో మొదటిసారిగా చూడడంతో కేరింతలు కొడుతూ సరదాగా గడిపారు. అయితే దీనికి సంబంధించిన వీడియో చర్చనీయాంశంగా మారింది. డాల్ఫిన్‌కు గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అయినట్లు వీడియోలో కనిపించడంపై నెటిజన్లు స్పందించారు.


బిహార్ రాష్ట్రం ఛప్రా ప్రాంతానికి చెందిన కొంతమంది చిన్నారులు స్థానికంగా ఉన్న గంగా నదికి ఈత కొట్టేందుకు వెళ్లారు. సరదాగా నీటిలో ఆడుకుంటూ ఉండగా వారికి ఓ డాల్ఫిన్ కనిపించింది. అది ప్రమాదవశాత్తూ నది ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దానిని చుట్టుముట్టిన చిన్నారులు బయటకు తీసుకువచ్చారు. డాల్ఫిన్‌ను చేతుల్లోకి తీసుకుని సరదాగా ఆడుకోవడం మొదలుపెట్టారు. ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. అది చూసిన స్థానికులు కూడా ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ తతంగం మొత్తం వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు డాల్ఫిన్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. డాల్ఫిన్ గాలి పీల్చుకోలేక చిన్నారుల చేతుల్లో ఉక్కిరిబిక్కిరి అయినట్లు కనిపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.


దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. 'తల్లిదండ్రులు, పెద్దలు జంతు హింస గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి. నిజంగా ఇది హృదయ విదారకం. ఆ డాల్ఫిన్ గాలి, నీటి కోసం అల్లాడుతోంది' అంటూ కామెంట్ చేశాడు. 'డాల్ఫిన్లు నీటి వెలుపల ఎక్కువసేపు జీవించలేవు, మనుషులు తాకడం వల్ల ఒత్తిడి పెరిగి ఊపిరి తీసుకోవడంలో మరింత ఇబ్బంది పడతాయి' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా పలు రకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్‌గా మారింది. ఒడ్డుకు కొట్టుకొచ్చిన జలచరాలను ఎప్పుడూ తాకకూడదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే స్థానిక అటవీ లేదా వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ..

Updated Date - May 14 , 2026 | 06:06 PM