Share News

ప్లాట్‌ఫామ్ కింద పడ్డ విదేశీ యువతి స్కార్ఫ్.. పట్టాలపైకి దూకిన వ్యక్తి.. చివరికి..

ABN , Publish Date - May 15 , 2026 | 07:34 AM

రైలు పట్టాలపై పడిపోయిన విదేశీ యువతి స్కార్ఫ్‌ కోసం.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి చేసిన సహాయం అందరి హృదయాలు గెలుచుకుంది. వివరాల్లోకి వెళితే..

ప్లాట్‌ఫామ్ కింద పడ్డ విదేశీ యువతి స్కార్ఫ్.. పట్టాలపైకి దూకిన వ్యక్తి.. చివరికి..
New Delhi Railway Station viral video

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ వేల సంఖ్యలో వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి, కానీ కొన్ని దృశ్యాలు మాత్రమే మన మనసుకు హత్తుకుంటాయి. తాజాగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఇండోనేషియా పర్యాటకురాలికి సహాయం చేసే క్రమంలో ఒక వ్యక్తి చూపిన ధైర్యం, మానవత్వం.. ఇప్పుడు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక ఇండోనేషియా మహిళ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు తలుపు వద్ద నిలబడి ఉంది. ఆ సమయంలో ఆమె స్కార్ఫ్ అనుకోకుండా జారి.. ప్లాట్‌ఫారమ్, రైలు పట్టాల మధ్య ఉన్న సందులో పడిపోయింది. ఊహించని ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వెంటనే స్పందించారు.


మొదట ప్లాట్‌ఫారమ్ పైనుంచే ఆ స్కార్ఫ్‌ను అందుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా అందకపోవడంతో.. చివరికి రైల్వే ట్రాక్‌పైకి దూకాడు. ప్రాణాలకు తెగించి పట్టాల మీదకు దిగి, ఆ స్కార్ఫ్‌ను తీసి ఆమెకు అందించారు. ఆ వ్యక్తి అంత వేగంగా స్పందిస్తాడని తాను అస్సలు ఊహించలేదని సదరు మహిళ ఆశ్చర్యపోయింది. స్కార్ఫ్ అందించిన తర్వాత, ఆమె నుంచి ఎటువంటి కృతజ్ఞతలు లేదా ప్రతిఫలాన్ని ఆశించకుండా అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను చేసిన సాయాన్ని ఆ మహిళ సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘రాహుల్ సరైన సమయంలో వచ్చాడు’ అంటూ 1998 నాటి ప్రసిద్ధ చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై' లోని షారుఖ్ ఖాన్ పాత్రతో అతడిని పోల్చింది.

అపరిచితురాలినైన తన పట్ల ఒక వ్యక్తి ఇంత త్వరగా స్పందించి సహాయం చేయడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. "నిజమైన హీరోలు మన మధ్యే ఉంటారు" అంటూ నెటిజన్లు ఆ వృద్ధునిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ..

Updated Date - May 15 , 2026 | 07:39 AM