Share News

ఫోన్ ఛార్జర్ కావాలంటూ ఇంట్లోకి వెళ్లి.. బాలికపై..

ABN , Publish Date - May 15 , 2026 | 11:14 AM

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. తాండూరు నియోజకవర్గం యాలాల మండల పరిధిలో ఓ బాలికపై ఫర్హాన్ అనే యువకుడు అమానుషానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే..

ఫోన్ ఛార్జర్ కావాలంటూ ఇంట్లోకి వెళ్లి.. బాలికపై..
Vikarabad Crime News

వికారాబాద్, మే 15: జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. తాండూరు నియోజకవర్గం యాలాల మండల పరిధిలో ఓ బాలికపై ఫర్హాన్ అనే యువకుడు అమానుషానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు, పథకం ప్రకారం బాలిక ఉన్న చోటికి చేరుకున్నాడు. మొదట దాహం వేస్తుందని నీళ్లు అడిగిన నిందితుడు, ఆపై ఫోన్ ఛార్జర్ కావాలంటూ సాకుతో ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.


జరిగిన దారుణాన్ని బాలిక.. తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు ఫర్హాన్‌పై ఫోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్, సిల్వర్ రేట్స్.. భారీగా ధరల పతనం

ప్రాంగణ నియామకాలకూ ఎగనామం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 15 , 2026 | 12:02 PM