Share News

మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

ABN , Publish Date - Jun 01 , 2026 | 08:29 AM

మే మాసంలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు కావడం, విద్యాసంస్థలకు విరామం రావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

మే నెలలో రికార్డు స్థాయిలో  శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
, Tirumala Srivari Darshan Record

తిరుమల, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): మే మాసంలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు కావడం, విద్యాసంస్థలకు విరామం రావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మే నెలలో తిరుమలలో రికార్డు స్థాయి దర్శనాలు, కానుకలు, తలనీలాలను భక్తులు సమర్పించారు.


రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలు

మే మాసంలో తిరుమల శ్రీవారిని 25,46,168 మంది భక్తులు దర్శించుకున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, స్వామివారిపై ఉన్న భక్తి శ్రద్ధలతో భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సర్వదర్శనం (ఉచిత దర్శనం) భక్తులకు గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా కంపార్ట్‌మెంట్‌లలో నిరంతరం తాగునీరు, పాలు, అన్నప్రసాదాల పంపిణీని నిరంతరాయంగా కొనసాగించారు.


హుండీ ద్వారా రికార్డు స్థాయి ఆదాయం

శ్రీవారిపై భక్తులు తమకున్న అపారమైన భక్తిని కానుకల రూపంలో చాటుకున్నారు. మే నెలలో స్వామివారికి రూ.120.28 కోట్ల ఆదాయం లభించింది. తిరుమల చరిత్రలో ఒకే నెలలో ఈ స్థాయి ఆదాయం రావడం భక్తుల అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. నగదు రూపంలోనే కాకుండా భక్తులు పెద్దఎత్తున బంగారం, వెండి ఆభరణాలను కూడా హుండీలో సమర్పించారు. స్వామివారికి భక్తులు తలనీలాలు సమర్పించారు. మే నెలలో 12,29773 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

యువ క్రీడాకారులకు స్ఫూర్తి సాత్విక్-చిరాగ్: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 01 , 2026 | 08:56 AM