తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
ABN , Publish Date - May 19 , 2026 | 06:43 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
శనివారం హుండీ ఆదాయం: రూ.3.54 కోట్లు
ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 91,020
తలనీలాలు సమర్పించినవారు: 35,193
ఈ వార్తలు కూడా చదవండి:
ఆరెంజ్ తోటల రైతులకు నీటి ఖర్చులు: అచ్చెన్న
యూరియాకు ప్రత్యేక కార్డుల విధానం
Read Latest AP News And Telangana News And International News And Telugu News