Share News

తిరుమలలో గాలిమరలతో ఏటా రూ.5.20 కోట్ల విద్యుత్ ఆదా

ABN , Publish Date - Oct 11 , 2026 | 01:12 PM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు క్షణకాలం పాటు కూడా విద్యుత్‌ అంతరాయం లేకుండా టీటీడీ విశేషంగా కృషి చేస్తోంది.

తిరుమలలో గాలిమరలతో ఏటా రూ.5.20 కోట్ల విద్యుత్ ఆదా
Tirumala Tirupati

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు క్షణకాలం పాటు కూడా విద్యుత్‌ అంతరాయం లేకుండా టీటీడీ విశేషంగా కృషి చేస్తోంది. స్వామి కొండపై ప్రకృతి వనరుల వినియోగానికి టీటీడీ పెద్దపీట వేస్తోంది. విద్యుత్‌ అవసరాల్లో కొంత భాగాన్ని విండ్‌ పపర్‌ ద్వారా సమకూర్చుకుంటూ కోట్లాది రూపాయలను ఆదా చేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. నిత్యకళ్యాణం పచ్చతోరణంలా స్వామి గిరులు కళకళలాడుతుంటాయి. విశేష ఉత్సవాలతో గోవిందుడి క్షేత్రం విద్యుత్‌ కాంతుల్లో కనువిందు చేస్తుంటుంది.


23 ఏళ్ల క్రితం... తొలి విండ్‌ టర్బైన్‌

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు, పాటు వివిధ విభాగాల అవసరాల నిమిత్తం టీటీడీ ఏడాదికి దాదాపు 6.20 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తోంది. క్షణం కూడా విద్యుత్‌ అంతరాయం లేకుండా టీటీడీ జాగ్రత్త పడుతుంది. 2003 ముందు వరకు టీటీడీ విద్యుత్‌ మొత్తాన్ని ప్రభుత్వం నుంచే కొనుగోలు చేసేది. అయితే విద్యుత్‌ వినియోగానికి అయ్యే ఖర్చులో కొంతైనా భారాన్ని తగ్గించుకునేలా టీటీడీ తొలిసారిగా ముంబైకు చెందిన ఎనార్కన్‌ అనే సంస్థ ద్వారా 2003లో హెచ్‌వీసీ వద్ద 230 కిలోవాట్ల విండ్‌ టర్బైన్‌ను ఏర్పాటు చేసింది. టర్బైన్‌ ఏర్పాటుతో పాటు నిర్వహణ కూడా ఈ సంస్థే చూసుకుంటే టీటీడీకి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.


book8.2.jpgకాకుల కొండపై మరో ఆరు

హెచ్‌వీసీ వద్ద ఏర్పాటు చేసిన విండ్‌ టర్బైన్‌ నుంచి మంచి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో విండ్‌పవర్‌ను మరింత పెంచాలని నిర్ణయించిన అప్పటి టీటీడీ అధికారులు సుజలాన్‌ అనే మరో సంస్థను సంప్రదించింది. పాపవినాశనం మార్గంలోని కాకుల కొండ గాలి బాగా వీచే ప్రాంతం కావడంతో సుజలాన్‌ సంస్థ 1.25 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు విండ్‌ టర్బైన్స్‌ను 2004లో దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసింది. వీటి నిర్వాహణ మొత్తాన్ని సంబంధింత సంస్థ చూసుకుంటూ యూనిట్‌ విద్యుత్‌ను రూ.2 చొప్పున 2019 వరకు టీటీడీకి విక్రయించింది. ఆతర్వాత లీజ్‌ కాంట్రాక్ట్‌ ముగియడంతో కొద్దిరోజుల వ్యవధిలోనే గ్రీన్‌ కో అనే మరో సంస్థ ఉచితంగా వీటి నిర్వహణను చేపట్టేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఆరు టర్బైన్స్‌ నుంచి కూడా టీటీడీకి ఉచితంగా విద్యుత్‌ అందుతోంది.


2007లో జీఎన్సీ వద్ద 800 కిలోవాట్లు, 2023లో విష్‌ విండ్‌ సంస్థ 800 కిలోవాట్ల విండ్‌ టర్బైన్లు ఏర్పాటయ్యాయి. ఈ రెండు కూడా టీటీడీకి విద్యుత్‌ను అందజేస్తున్నాయి. ఇలా 9 విండ్‌ టర్బైన్స్‌ ద్వారా టీటీడీకి ఉచితంగా ఏడాది కోటి యూనిట్ల విద్యుత్‌ అందుతోంది. అంటే ప్రస్తుత విద్యుత్‌ ధరలతో పోలిస్తే దాదాపు రూ.5.20 కోట్ల విలువైన విద్యుత్‌ టీటీడీకి అందుతోంది. కాగా, త్వరలో జీఎన్సీకి సమీపంలో విష్‌ విండ్‌ అనే సంస్థ ద్వారా మరో 800 మెగావాట్ల సామర్థ్యంతో విండ్‌ టర్బైన్‌ ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఇది కూడా అందుబాటులోకి వస్తే టీటీడీకి దాదాపు రూ.6 కోట్ల విలువైన విద్యుత్‌ ఆదా కానుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...

అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 01:12 PM