Share News

మేడ్చల్ జిల్లాలో విషాదం.. ఐదేళ్ల చిన్నారి హత్య.. సెక్యూరిటీపై అనుమానాలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:27 AM

మేడ్చల్ జిల్లా బొల్లారంలోని కౌకూర్‌ విల్లా ఆర్చిడ్స్‌ అపార్ట్‌మెంట్‌లో కిడ్నాప్‌నకు గురైన పాప కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. చిన్నారిని చంపేసి క్లబ్ హౌస్ సెల్లార్‌లో సెక్యూరిటీ విక్రమ్ పడేసినట్లుగా అనుమానిస్తున్నారు.

మేడ్చల్ జిల్లాలో విషాదం.. ఐదేళ్ల చిన్నారి హత్య.. సెక్యూరిటీపై అనుమానాలు
Bollaram Child Case

మేడ్చల్ జిల్లా, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లా బొల్లారంలోని కౌకూర్‌ విల్లా ఆర్చిడ్స్‌ అపార్ట్‌మెంట్‌లో కిడ్నాప్‌నకు గురైన పాప కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. చిన్నారిని చంపేసి క్లబ్ హౌస్ సెల్లార్‌లో సెక్యూరిటీగార్డ్ విక్రమ్ పడేసినట్లుగా అనుమానిస్తున్నారు. పాపను చంపేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ సికింద్రాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అతడి మొబైల్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్‌లోనే ఉన్నట్లుగా తెలియడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి నిన్న (శనివారం) రాత్రి తొలుత సెల్లార్‌లో ఆడుకుంటూ అదృశ్యమైందని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, పాప కుటుంబ సభ్యులను సెక్యూరిటీగార్డ్ డబ్బులు డిమాండ్‌ చేసినట్లుగా సమాచారం. ఈ క్రమంలో తాను ఎక్కడ పోలీసులకు దొరికిపోతాననే భయంతోనే చిన్నారిని అతడు చంపేసినట్లుగా తెలుస్తోంది.


కాగా, నిన్న పాప వెనకాలే సెక్యూరిటీ గార్డ్ వెళ్తున్న వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గత రెండు రోజులుగా అనుమానాస్పదంగా ఇంటి చుట్టే అతను తిరిగినట్లుగా గుర్తించారు. పాప కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.


సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. చిన్నారి సెక్యూరిటీ విక్రమ్‌తో కలిసి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసులు శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేశారు. పోలీసుల విచారణలో చిన్నారిని చంపేసినట్లుగా వెల్లడైంది. పాప మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బేబీ రుక్సానాకు మెరుగైన వైద్యం, ఆమె తల్లికి ఉద్యోగం కల్పిస్తాం: మంత్రి దామోదర

జగన్ అక్రమాస్తుల కేసుల్లో వేగం పెంచాలి.. తెలంగాణ హై కోర్టులో ఈడీ పిటిషన్

203 ఆస్పత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా: ఎన్టీఆర్ ట్రస్టు చర్యలు

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 08:12 AM